తెలంగాణ

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మరో 84 పెట్రోల్ బంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 28: పరివర్తన చెందిన ఖైదీల సంక్షేమానికి రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో సుమారు 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 16 పూర్తయ్యాయని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ సబ్‌జైలు పక్కన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో మై నేషన్ గ్యాస్ స్టేషన్ (పెట్రోల్) బంకును ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధి లేని ఖైదీలకు పెట్రోల్ బంకులు ఏర్పాటుచేసి అందులో ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా జైళ్లలో ఉత్పత్తి చేసిన వాటిని విక్రయించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిరక్షరాస్య ఖైదీలకు అక్షరాస్యత కల్పిస్తున్నామన్నారు. హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని నర్సరీల్లో ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన, తూకాల్లో మోసాలు లేకుండా వినియోగదారులకు పెట్రోల్, డిజిల్ అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎ.నర్సింహా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.సైదయ్య, రాజేష్, జిల్లా అధికారి పి.రాంరెడ్డి, జిల్లా ఏఎస్పీ పద్మనాభరెడ్డి, ఐఓసిఎల్ ఈడి భరద్వాజ్, డిప్యూటీ చీఫ్ జనరల్ మేనేజర్ రమణారావు, దీపక్‌దాస్‌లు పాల్గొన్నారు.