తెలంగాణ

ప్రజలంతా మా గట్టునే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 28: మీ గట్టున ఉండి పరిపాలనను చూసిన ప్రజలు ఇప్పుడు మా గట్టున ఉన్నారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ విశ్వసనీయత, టీఆర్‌ఎస్ విశ్వసనీయత ఏమిటో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ధర్మం, నిజాయితీ గెలుస్తుందని తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ సభలో కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే దక్షిణ భారతదేశం మొత్తం బడ్జెట్ కూడా సరిపోదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 2004, 2009 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేశామా లేదా అనే దానిపై మేము చర్చకు సిద్ధమని, 2014 టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల అమలుపై మీరు చర్చకు సిద్ధమా? అని మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను నిలదీసారు. 2004 ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించిన సోనియా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవటం వల్లే తెలంగాణ వచ్చిందే తప్ప కేసీఆర్ కింద అంబాడిన కూడా రాకపోయేదని, అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వసనీయత అని చెప్పారు. పూటకో మాట, గడియకో తీరు అబద్ధాల పునాదులపై నాలుగేళ్ల పాలన సాగించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కంటే అబద్దాల చంద్రశేఖర్‌రావు అంటేనే బాగుంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీతో మీరు పొత్తు పెట్టుకుంటే ఏమిలేదు కాని ఇతర పార్టీలు పెట్టుకుంటే తప్పా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ పర్యటన అనంతరం కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్‌ఎస్ భయపడిపోతోందని, అందుకే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెడుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బెదిరింపులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడవద్దని భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీరందించకుంటే ఓట్లు అడగనంటూ ప్రకటించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓట్లు ఏలా అడుగుతారని ప్రశ్నించారు. జరగబోయే ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణిస్తూ, ప్రజలు ధర్మం వైపే నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గవర్నర్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని, అబద్దాలకు అంబాసిడర్‌గా అవతారం ఎత్తారని మండిపడ్డారు. అపద్ధర్మ ముఖ్యమంత్రి, మంత్రులు పలు ప్రారంభోత్సవాలు చేస్తూ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చేసిన చీరల ప్రకటన కూడా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలోనే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. ఇకపోతే ఏకగ్రీవ తీర్మానాల పేరిట కొత్త సంస్కృతికి టీఆర్‌ఎస్ తెరలేపిందని, ఈ చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిలా ఉందని అన్నారు. ఏకగ్రీవ తీర్మానాలు చేసిన గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడుతామని చెప్పారు. రాష్ట్రంలో నియంత, రాచరిక పాలన సాగిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ను ఓడించేందుకు కార్యకర్తలు, నాయకులు కసిగా పనిచేయాలని అటు పార్టీ శ్రేణులకు, ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ అటు ప్రజలకు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, నాయకులు గజ్జెల కాంతం, ప్యాట రమేష్, కర్ర రాజశేఖర్, డి.శంకర్, ఆకుల ప్రకాష్, నాగి శేఖర్, గుగ్గిల్ల జయశ్రీలతోపాటు పలువురు పాల్గొన్నారు.