తెలంగాణ

విపక్షాలు విషం చిమ్ముతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: అన్ని వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేలా పరిపాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని అపద్ధర్మ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. సామాజిక మాధ్యామాల వేదికగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలకు దిగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదో నష్టం చేసినట్టు కేసీఆర్ గద్దెదిగాలని ప్రతిపక్షాలు అదే పనిగా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కూడా ఇదే పార్టీలు చౌకబారు విమర్శలు చేసాయని గర్తు చేసారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మొక్కవోని ధైర్యంతో 14 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్‌గా పెట్టుకొని ఉద్యమం చేసి, వీటిని సాకారం చేసుకోవాలంటే అది ఒక కేసీఆర్‌కే సాధ్యమని ప్రజలు పట్టం కట్టారన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి భారీ ఎత్తు ప్రాజెక్టులకు రీడిజైన్ చేయడకమే కాకుండా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించి అద్బుత విజయం సాధించారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికి మంచినీరు అందించడానికి మిషన్ భగీరథ వంటి ఆదర్శవంతమైన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో అభివృద్ధి పనులకు రూ.132 కోట్లు విడుదల చేస్తే అందులో తెలంగాణకు కేటాయించింది కేవలం ఏడు కోట్లు మాత్రమే కావడంతో తాము ఆందోళనకు దిగిన విషయాన్ని ఈటల గుర్తు చేసారు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా యాబై వేల కోట్ల బడ్జెట్‌కు చేరుకోగలిగామన్నారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్, సింగరేణి, ఆర్టీసి వంటి కార్పొరేషన్ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులకు వేతనాలు పెంచామన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 1,28,274 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తించి లక్ష 2,217 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేసామని ఈటల రాజేందర్ గుర్తు చేసారు. వీటిలో ఇప్పటికే 32,681 పోస్టులు భర్తీ చేసామన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులు రావడానికి అనువైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.
అయినప్పటికీ రాజకీయాలను కులం, మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. కులాన్ని నమ్ముకున్న ఏ పార్టీ నిలదొక్కుకోదని, కులం పేరుతో రాజకీయ నాయకత్వం నిలబడదని, అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందినవారే నిజమైన నాయకులుగా నిలబడుతారని ఈటల గుర్తు చేసారు. ఆరై ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని నిండా ముంచి ఇప్పుడు నీతి వ్యాఖ్యాలు చేస్తున్నాయని ఈటల ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీనే గుబాళిస్తుందన్నారు.