తెలంగాణ

గ్రామాలకు ఈవీఎం, వీవీ ప్యాట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్ర శాసనసభకు జరగాల్సిన ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. పోలింగ్‌కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) లను ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రేయిల్ (వీవీ ప్యాట్) లను వాడుతున్నందు వల్ల వీటిని ఏ విధంగా ఉపయోగించాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి రజత్ కుమార్ ఈ మేరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఎన్నికల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మొట్టమొదట జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్‌ఓ) తదితరులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఏ విధంగా ఉపోయోగించాలన్న అంశంపై ‘ప్రదర్శనల’ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను పంపించి జనాన్ని చైతన్యం కలిగించేందుకు భారీ ప్రణాళికను రూపొందించారు. బ్యాలెట్ పత్రాలకంటే ఈవీఎంల ద్వారా ఓటు వేయడం సులువవుతుందని, ఎవరికి ఓటు వేశారో పరిశీలించేందుకు వీవీ ప్యాట్‌ల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందన్న అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించారు. దీంతో రాష్టస్థ్రాయి నుండి గ్రామస్థాయి వరకు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.