తెలంగాణ

‘నోటా’ చిత్రాన్ని నిలిపి వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ‘నోటా’ చిత్రాన్ని వెంటనే నిలిపి వేయాలని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ‘నోటా’ చిత్రం ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇది యువతపై ప్రభావం చూపుతుందని తాను భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల నియామవళికి విరుద్ధం అని ఆయన చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ‘నోటా’ చిత్రాన్న వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల సంఘం తొలుత ‘నోటా’ ప్రివ్యూ చూసిన తర్వాతే చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. టీఆర్‌ఎస్ స్పందించలేదు కాబట్టి తామూ మాట్లాడరాదంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.