తెలంగాణ

ఏసీబీ వలలో ఉద్యాన శాఖ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, అక్టోబర్ 5: ఉద్యానవన శాఖ అధికారి జావేద్‌పాషా రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన శుక్రవారం కోరుట్లలో కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన నూతుల రవి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కోరుట్ల ఉద్యావనశాఖ అధికారి జావేద్‌పాషాను తన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తొందరగా పూర్తి చేయాలని పలు మార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని చివరి సారిగా బుధవారం ఫోన్ చేసి రూ. 15వేలు ఇస్తే తన పనిచేస్తానని చెప్పడంతోనే చేసేదేమీ లేకపోవడంతో రూ. 10వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను సంప్రదించి కోరుట్లలో శుక్రవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో పాత బస్టాండ్‌లోని తన కార్యాలయంలో రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ దాడిలో డీఎస్పీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.