తెలంగాణ
28న బీసీల గర్జన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 8 October 2018
హైదరాబాద్, అక్టోబర్ 7: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 65 శాతం అసెంబ్లీ టికెట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ నెల 28న బీసీ గర్జన సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న బీసీల భారీ సభకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చింది. అయితే హైదరాబాద్‌లో బహిరంగ సభ ఎక్కడ జరపాలన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ మహా బహిరంగ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని కోర్ కమిటీ నిర్ణయించింది. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేశాయని కోర్ కమిటీ అభిప్రాయపడింది. బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు చేయడంతో పాలక ప్రభుత్వాలు వివిధ పథకాలు తీసుకువచ్చాయని వెల్లడించింది.