తెలంగాణ

ఆగమానుసారమే యాదాద్రి నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 9: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయం పునర్ నిర్మాణ పనులు ఆగమశాస్త్రంను అనుసరించి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచనలతో నిర్వహిస్తున్నట్లుగా ఆలయ వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, అర్కిటెక్ట్ ఆనందసాయి, మధు, స్థపతులు సుందర్‌రాజన్, వేలు, మోతిలాల్‌లు తెలిపారు. మంగళవారం స్థానిక విలేఖరులకు ఆలయ నిర్మాణ పనుల తీరుతెన్నులను క్షేత్ర స్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. పూర్తిగా దేశంలో ఏకైక రాతి నిర్మితమైన తంజావూర్ తరహాలో యాదాద్రి ఆలయాన్ని సైతం పూర్తిగా రాతికట్టడాలతో నిర్మించడం జరుగుతుందన్నారు.
పురాణ గాథలు, ఇతీహాసల విశేషాలతో, వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో, పంఛనరసింహుల విశేష మూర్తులతో, భక్తప్రహ్లాద చరిత్రలతో, పనె్నండు మంది ఆళ్వార్‌ల శిల్పాలతో ఆలయ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిద్దుతున్నామన్నారు. రామానుజమందీర్, అండాళ్ అమ్మవారి ఆలయం, క్షేత్ర పాలకుడుడి ఆంజనేయుడి ఆలయం ప్రధాన ఆలయంలో అంతర్భాగంగా నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. సప్త రాజగోపురాలు, మహా ప్రాకారాలు, మహామండపాలతో ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ఒక్కో గోపుర నిర్మాణానికి పదిహేను వేల టన్నుల కృష్ణశిలలను వినియోగించామన్నారు. తమిళనాడు, మహాబలిపురంల కంటే కూడా 54రాతిఫిల్లర్లతో యాదాద్రి ఆలయం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. కల్యాణ మండపాలు, అద్దాల మేడ, 33నరసింహమూర్తులను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. పాత ఆలయంలో ఏ విధంగానైనా దర్శనాలు కొనసాగాయో అదే రీతిలో నూతన ఆలయంలో కూడా దర్శనాలు సాగుతున్నాయన్నారు. గర్భగుడి ప్రాంగణంలో అగ్నేయంలో రామానుజకూటమి, స్టోర్ రూమ్, స్వామివారి నైవేద్య గది, యాగశాల ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. గర్భగుడి మహాద్వారాన్ని భక్తులకు మరింత స్పష్టంగా పంఛనరసింహుల దర్శనం జరిగే విధంగా, రాబోయే రోజుల్లో పెరిగే రద్ధీని తట్టుకునే విధంగా 12్ఫట్ల ఎత్తు, 8్ఫట్ల వెడల్పుతో విస్తరించనున్నట్లుగా తెలిపారు. పాత ఆలయం మొత్తం వైశాల్యం 1.5ఎకరం కాగా నూతన ఆలయంలో 2.30ఎకరాల వైశాల్యం ఉంటుందన్నారు. గర్భాలయంలోనే బలిహారణ, మండల దీక్షల భక్తులకు ప్రదక్షిణలు చేసుకునేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. గర్భాలయానికి ఎదురుగా 36అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. స్తంభాలు, శిల్పాల తయారీ, తరలింపు, నిర్మాణాల్లో వాటి అమరికల పనులు జాగ్రత్తగా చేయాల్సివుండటంతో కొత్త ఆలస్యమవుతుందన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి స్వయంభూ దర్శనాలు కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయన్నారు. కొండపైన వాహనశాల, బ్రహ్మోత్సవాల కల్యాణ మండపం, కొండ కింద మరో బ్రహ్మోత్సవాల కల్యాణ మండపం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. కల్యాణకట్ట, మహాపుష్కరణిని విస్తరిస్తున్నామని, అలాగే నూతన శివాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. భక్తుల కాటేజీలు, ప్రెసిడెన్షియల్ సూట్‌లు, నవగిరుల అభివృద్ధి, పచ్చదనం, నృసింహ అభయారణ్యం పనులు, గుట్ట చుట్కుపక్కల ఉన్న చెరువుల సుందరీకరణ పనులన్ని ఆయా శాఖలు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.