తెలంగాణ

ప్రచార రహస్యాలు గోప్యం ... ఎవరికి వారుగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, అక్టోబర్ 9: ముందస్తు ఎన్నికల వేళ ప్రచార రహస్యాలను గోప్యంగా ఉంచుతున్న ప్రధాన పార్టీలకు చెందిన నేతలు చివరి నిమిషం వరకు తాము ఏ గ్రామంలో పర్యటిస్తున్నారో అన్న విషయాన్ని సైతం కార్యకర్తలకు వెల్లడించకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వలసలను ప్రోత్సహిస్తూ తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు తటస్థులను తమ పార్టీలో చేర్చుకోవడంలో సఫలం కాగా బీజేపీ మాత్రం నేటికి ఇంకా ఈ ప్రక్రియను ప్రారంబించలేదు. కాగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరికి వారుగా తమ ప్రచారాలను ఉధృతం చేస్తూ ముందుకు సాగుతుండగా గ్రామాల్లో మాత్రం రాజకీయ వేడి ఇప్పటికే రాజుకుంది. ఉదయం నుండి ప్రచారాల్లో నిమగ్నమయ్యే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సాయంత్రం వేళ తాము రేపు తలపెట్టబోయే పనుల గురించి ముందుగా కార్యకర్తలకు వివరించకుండా ఉదయానే్న తమ కార్యక్రమాల వివరాలను వివరిస్తూ కార్యకర్తలు వెంటేసుకుని తిరుగుతున్నారు. కాగా బుధవారం నారాయణపేటలో కాంగ్రెస్ సంకీర్ణ మహాకూటమి తరఫున పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కో-చైర్మన్ డికె అరుణ, కాంగ్రెస్ స్టార్ కంపెయనర్ విజయశాంతి స్థానిక సింగారం చౌరస్తా నుండి బైక్ ర్యాలీతో రోడ్‌షోను ప్రారంబించి పట్టణ పురవీధుల గుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఏర్పాట్లు చేసి ఈ రోడ్‌షోను నారాయణపేట పట్టణం మొత్తం మీద సాగించి స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకు సంబందించి మంగళవారం మధ్యాహ్నం తరువాత ఏర్పాట్లను ప్రారంబించిన కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా బిజెపి మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సంకీర్ణ మహాకూటమి ఎత్తులను సునిశితంగా పరిశీలిస్తూనే విజయం కోసం అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఖరారు అనంతరం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైన బీజేపీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రచార రథాలతో ప్రచారాన్ని స్థానిక నేతల సహకారంతో కొనసాగిస్తోంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలను అన్నీ ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ప్రధాన పార్టీల రంగంలో నిలుచునే అభ్యర్థులు ఓటర్ల నాడిని పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అవకాశం ఇస్తే..సేవకుడిలా పనిచేస్తా..
* లలితాపూర్ దళిత కాలనిలో రసమయి ప్రచారం
మానకొండూర్, అక్టోబరు 9: రాభోయే అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిలా పని చేస్తానాన్ని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని లలితాపూర్ గ్రామంలోని దళిత కాలనిలో రసమయి బాలకిషన్ ఇంటింట తిరుగుతూ టీఆర్‌ఎస్ ప్రచారం జోరుగా చెపట్టారు. ముందుగా మంగళ హరతితో రసమయి బాలకిషన్‌కు కాలని మహిళలు ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ నాలుగెళ్లన్నర కాలంలో దళిత అభివృద్ధి చేందిన్నారని తెలిపారు. గత పాలకులు దళిత కాలని అభివృద్ధి గురించి పట్టించుకోవలేదని అరోపించారు. దళిత బిడ్డను మీరందరు మరోసారి ఆశిర్వదించి టిఆర్‌ఎస్‌కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ కుమారుడు బాబు రసమయి ఎత్తుకున్నారు. అనంతరం కాలని మహిళలు రసమయి బాలకిషన్‌కు ఘనంగా సన్మానం చేపట్టారు. మండల అధ్యక్షులు శేఖర్, టీఆర్‌ఎస్ గ్రామాశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, కొండయ్య, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గం ఇన్‌చార్జి గుర్రం కిరణ్, దంఢబొయిన శేఖర్, తదితరులు పాల్గొన్నారు.