తెలంగాణ

మరో పరువు హత్య!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రేమికుడి అనుమానాస్పద మృతి * ప్రియురాలి కుటుంబీకులే చంపారంటున్న మృతుని బంధువులు.. ప్రియురాలు
* ఎస్‌ఐని సస్పెండ్ చేయాలంటూ హైవేపై గ్రామస్థుల రాస్తారోకో
శంకరపట్నం, అక్టోబర్ 9: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఓ ప్రేమికుడు శవమై కనిపించిన సంఘటన గ్రామంలో కలకలం రేపింది. ప్రియురాలి కుటుంబ సభ్యులే హత్యచేసి ఉంటారని మృతుని ప్రియురాలి (మైనర్)తోబాటు, మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి కుమార్ (23) అనే యువకుడు, ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ చదివే ఓ బాలిక గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై ఇరువురి కుటుంబ సభ్యులూ మందలించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో, గ్రామ పెద్దల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించినప్పటికీ మార్పు రాలేదు. ఈ క్రమంలో శనివారం ఈ ప్రేమ జంట నిజామాబాద్ జిల్లాకు వెళ్లి తిరిగి ఆదివారం గ్రామానికి చేరుకుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో కుమార్‌కు ఫోన్ రావడంతో ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు తనను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారని ఫోన్‌చేసి కుమార్ తెలిపినట్లు ప్రియురాలు, మృతుని తల్లిదండ్రులు సారయ్య, మల్లమ్మ రోదిస్తూ వివరించారు. కుమార్ సోమవారం తిరిగి రాకపోవడంతో మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడిని ప్రియురాలి కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారని, అతనికి ప్రాణహాని ఉందని స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణకు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా తమపట్ల ఎస్‌ఐ అనుచితంగా ప్రవర్తిస్తూ ఎక్కడున్నాడో వస్తాడు వెళ్లు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని, సోమవారం రాత్రి కరీంనగర్-వరంగల్ హైవేపై రాస్తారోకో నిర్వహించగా ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని స్టేషన్‌కు రప్పించి ఫిర్యాదు తీసుకున్నాడని, తర్వాత కుమార్ ఆచూకీ విషయం పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట రోదిస్తూ వివరించారు.
ఇలావుండగా మంగళవారం తాడికల్-వంకాయగూడెం సమీపంలోని ఓ పత్తి చేనులో కుమార్ శవమై కనిపించాడు. ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకోగానే గో-బ్యాక్ అంటూ గ్రామస్థులు రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎస్‌ఐపై కొందరు రాళ్లు రువ్వేందుకు యత్నించగా ఎస్‌ఐ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో గ్రామస్థులు కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే హుజూరాబాద్ ఏసీపీ కృపాకర్, సీఐలు రవి కుమార్, నారాయణ, ఇంద్రసేనారెడ్డి, దామోదర్ రెడ్డి, మాధవి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేసేందుకు రెండు గంటల పాటు ప్రయత్నించి మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి టాస్క్ఫోర్స్ ఏసీపీ శోభన్ కుమార్, కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకొని ఆందోళనకారులను పంపించేశారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మృతుని కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మాచర్ల నర్సయ్య, శ్రీనివాస్, సమ్మయ్య, మొల్గూరి శ్రీనివాస్, సత్యనారాయణలే కుమార్‌ని హత్య చేసి ఉంటారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వారు డిమాండ్ చేశారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ డీసీపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో హుజూరాబాద్ ఏసీపీ కృపాకర్ పర్యవేక్షణలో హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, పోస్టుమార్టంకు తరలివెళ్లిన మృతదేహం తిరిగి తాడికల్‌కు మంగళవారం సాయంత్రం చేరుకోవడంతో మృతదేహాన్ని ప్రియురాలు మైనర్ బాలిక ఇంటి ఎదుట వేసేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు నర్సయ్య ఇంటి వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి అంత్యక్రియలు జరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఇలావుండగా కుమార్‌ను చరవాణిలో బెదిరించి ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి తీసుకెళ్లిన వ్యక్తులెవరనేది తేలాల్సి ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తిస్తే వాస్తవాలు వెలుగులోకి రావచ్చని గ్రామస్థులు పేర్కొన్నారు. కుమార్ హుజూరాబాద్ పట్టణంలోని సెల్‌పాయింట్‌లో పనిచేస్తుండగా, బాలిక హుజూరాబాద్ పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంద.