తెలంగాణ

కేసీఆర్ పతనం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: మహాకూటమి ఏర్పాటుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్దూం భవనంలో సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, డా. బీ సుధాకర్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీని రద్దు చేసిన తరువాత కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు తారుమారుకావడం తథ్యమన్నారు. 15 నుంచి 20 సార్లు సర్వే జరిపించుకున్న కేసీఆర్‌కు సీట్లు తగ్గుతాయన్న నివేదికలు వస్తున్నాయి తప్పా పెరిగే అవకాశం లేదన్నారు. విపక్షాలపై సీఎం విరుచుకుపడడం ఎంతవరకు సమజసమని ఆయన నిలదీశారు. కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్ మహాకూటమి కాదని విషకూటమని అపచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ విపక్షాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా గర్హించారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అసెంబ్లీని ఎందుకు రద్దు చేశానా అని మదనపడుతున్నారని చాడ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలే మహాటమి లక్ష్యమని, ఉద్యమ ఆకాంక్షలు, ఆత్మగౌరం కాపాడేందుకు మహాకూటమి పని చేస్తుందని సీపీఐ నేత చెప్పారు. సీట్ల సర్దుబాటుపై త్వరంగా తేల్చాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన తెలిపారు.