తెలంగాణ

ప్రవర్తనావళి విస్మరించి... సహనం కోల్పోయ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, అక్టోబర్ 10: తెలంగాణలో ప్రసు తతం రాజకీయ నాయకులు ఆరోపణ, ప్రత్యారోపణలతో సహనం కోల్పోతున్నారు. గతంలో ఎన్న డూ లేని రీతిలో నాయకులు తీవ్ర స్థాయిల్లో పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం నిత్యకృత్యమవుతోంది. ఎన్నికల సమయాన రాజకీయ పక్షా లు, నాయకులు, అభ్యర్థులు విధిగా ప్రవర్తనా ని యమావళిని పాటించాల్సి ఉంటుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రవర్తనా ని యమావళిని ఇదివరకే రూపొందించి, అమలు చేస్తుంది. ప్రస్తుతమున్న విభేదాలను పెంచే, లేదా.. పరస్పర ద్వేషాలను కలుగేజేసే లేదా.. విభిన్న కు లాలు, వర్గాలు, మతాలు లేదా.. భాషల మధ్య ఉద్రిక్తతకు దారితీసేట్టి కార్యకలాపాలకు పార్టీగాని, అభ్యర్థిగాని పాల్పడకూడదని నియమావళి పేర్కొంటుంది. ఓట్లను పొందేందుకు మతం, వ ర్గం, కులం భావాలతో అభ్యర్థించ కూడదని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలగు ఆరాధ నా ప్రదేశాలను ఎన్నికల ప్రచారానికి వేదికగా ఉపయోగించ రాదని స్పష్టం చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అతని ప్రజా జీవితం తో సంబంధం లేని, ఏదేని అంశంపై విమర్శను చేయరాదని, పరిశీలించలేని వాస్తవాలు లేదా సం ఘటనలపై ఆధారపడే ఏవేని ఆరోపణలు చేయరాదని వివరించింది. ఒక రాజకీయ పార్టీని విమర్శించేపుడు, దాని విధానాలు, కార్యక్రమాలు, గత రికార్డు, పనులకు పరిమితం చేయాలి. పరిశీలించలేని ఆరోపణల ఆధారంగా విమర్శలు చేయకూడదని పేర్కొంది. అందరు అభ్యర్థులు తప్పని స రిగా పాటించాల్సిన అంశాలను వివరిస్తూ, మతం కులం వర్గం ప్రాతిపదికన ఓట్లు వేయమని లేదా ఓట్లను వేయవద్దని అర్థించడం, ఓట్లను అభ్యర్థించడానికి ఏదేని మతపరమైన గుర్తును ఉపయోగించరాదని, ముద్రాపకుడు, పబ్లిషర్ పేరు, చిరునామాలను పేర్కొనకుండా ఏ దేని పోస్టరు, పాం ప్లెట్లు, లీఫ్‌లెట్, సర్కులర్, ప్రకటనను ముద్రించ డం, ప్రకటించడం చేయరాదని, అభ్యర్థి వ్యక్తిగత ప్రవర్తన లేదా నడవడికకు సంబంధించి అతని లే దా.. ఆమె ఎన్ని క అవకాశాలపై తీవ్రంగా ప్రభా వం చూపాలనే ఉద్దశంతో, అసత్యమైన లేదా నిజమని నమ్మలేని ప్రకటనను లేదా వార్త అంశాన్ని ప్ర చురించడం చేయరాదని వివరించింది. మరో రా జకీయ పార్టీ లేదా అభ్యర్థిచే ఏ ర్పాటు చేయబడిన ఏదేని ఎన్నికల సమావేశాన్ని ఆటంక పరచడం, భం గపరచడం చేయరాదని, పోలింగ్ సమయానికి 48గంటల ముందు నుండి ఊరేగింపులను లేదా సమావేశాలను జరపడం నిలిపివేయాలని పే ర్కొంది. ఓటర్లకు ఏరూపంలోనైనా లంచం లేదా రివార్డును ఇవ్వజూపడం, పోలింగ్‌కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓట్ల ప్రచారం చేయడం, అర్థించడం, పోలింగ్ కేంద్రానికి వాహనాలను ఉపయోగించడం, పోలింగ్ అధికారి విధులను నిర్వర్తించడాన్ని అడ్డగించడం, మారుపేరు కింద ఓటు వేయడానికి ప్రయత్నించరాదని వివరించింది.