తెలంగాణ

టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇంతే కాకుండా కామారెడ్డి అసెంబ్లీ పరిధిలో అప్పుడే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కురుక్షేత్రం మొదలైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ మధ్య రాజకీయ కురుక్షేత్రం మొదలైంది. బుధవారం ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో పాటు, ఇద్దరూ వారి వారి సవాళ్లకు, ఎన్నికల కోడ్, పోలీస్ యాక్ట్ 30ని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి హంగామాలు లేకుండా కేవలం ఇద్దరూ కలిసి, ఇక్కడి గాంధీగంజ్‌కు వచ్చి అక్కడే పాత్రికేయుల ముందు ఆస్తుల యుద్ధం ప్రకటిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణల వర్షం కురిపించుకున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా చర్చంశనీయాంశగా మారింది. ఉదయం ముందుగా కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ విప్, టీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన గంపగోవర్ధన్ తన ఇద్దరు ప్రధాన అనుచరులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. తన ఆస్తుల పత్రాలతో వచ్చి మహాత్మాగాంధీ విగ్రహానికి తన ఆస్తుల ప్రతులను అందించారు. అనంతరము మహాత్మగాంధీ సాక్షిగా అక్కడే గంపగోవర్ధన్ మాట్లాడుతూ, నా ఆస్తులను మీడియా ముందు వచ్చి వెల్లడించాను, నీ ఆస్తులను వెల్లడికి నీవు సిద్దామా షబ్బీర్‌అలీ అంటూ తాజాగా మరో సవాల్ విసిరారు. ఆస్తుల పంపకం చర్చకు నేను ఎప్పుడు సిద్దం, ఎవ్వరు వద్దు ఇద్దరమే చర్చిద్దాం రా అని అన్నారు. నాల్గు సార్లు గెలిచి నిజాయితీగా ఉన్న నన్ను, కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ల నుండి ఏడు సార్లు పోటీ చేసి 5సార్లు ఓడిపోయిన నీవు వందల కోట్లు ఏలా సంపాదించావుఅంటూ ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అని తప్పించుకోకుండా తన సవాల్ స్వీకరించి వచ్చి ఆస్తులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. నీ ఆస్తులతో పాటు రేవంత్‌రెడ్డి ఆస్తులన్ని కూడా కామారెడ్డి అభివృద్ధికి ఖర్చుచెద్దాం అని సవాల్ చేశారు. షబ్బీర్‌అలీ కామారెడ్డిలోని శ్రీనివాస్‌నగర్ 218గజాల ఇళ్లు, బంజరా హిల్స్ రోడ్డు నంబర్ 12లో 1313ఎస్‌ఎఫ్‌టీ పెంట్‌హౌస్, భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో ఇళ్లు, క్యాసంపల్లి శివారులో 2ఎకరాల 30గుంటల భూమి, బస్వాపూర్‌లో 10ఎకరాల వ్యవసాయ భూమి, ఇంతే కాకుండా వందలాది కోట్ల ఆస్తులు ఏలా సంపాదించావ్ అంటూ ప్రశ్నించారు. షబ్బీర్‌అలీ నీవు రాజకీయ నాయకునివి కాదు కేవలం రాజకీయ బ్రోకర్ అంటూ సంబోందించారు. 1994నుండి ఎమ్మెల్యేగా ఉండి సంపాదించిన తన ఆస్తులను మీడియా ముందు ఉంచుతున్నాను, నీ ఆస్తులు ఎప్పుడు ఉంచుతావో టైం నీవే చెప్పు, నా ఆస్తులు, నీ ఆస్తులు జిల్లా కలెక్టర్ వద్ద జమ చేసి పేదలకు పంచి పెడదామ్ అని సవాల్ విసిరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు ముజిబొద్దిన్, వేణుగోపాల్ ఉన్నారు.
నీవా నాకు సవాల్ విసిరేది: షబ్బీర్‌అలీ
తాను చట్టవిరుద్దంగా ఏలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని, తాను సంపాదించుకున్న ప్రతి ఆస్తికి ప్రభుత్వానికి ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తున్నాని, 20ఏళ్ల నుండి తాను ఇస్తున్న ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ నువ్వునేరుగా వచ్చి, చూసుకున్న సరే, లేదా నీ మనుషులను పంపి చూసుకున్న సరే అని శాసనమండలి ప్రతిపక్ష నేత కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ, తాజా మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌కు కౌంటర్ సవాల్ విసిరారు. బుధవారం ఉదయం గంపగోవర్ధన్ వచ్చిన వెళ్లిన తరువాత తన ఇద్దరు అనుచరులతో షబ్బీర్‌అలీ గాంధీగంజ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని మహాత్మాగాంధీ సాక్షిగా ఆయన అక్కడ గంప సవాల్ స్వీకరించి పాత్రికేయులతో మాట్లాడారు. గత వారం రోజుల నుండి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలైన గంపగోవర్ధన్, షబ్బీర్‌అలీ మధ్య సవాల్ ప్రారంభం అయి చివరకు ఇద్దరు ఒక్కసారి గాంధీగంజ్‌కు రాలేక పోయిన, ముందు గంపగోవర్ధన్, తరువాత షబ్బీర్‌అలీ వచ్చి ఒకరిపై ఒకరు ఆస్తుల యుద్ధం ప్రకటించారు. గంపగోవర్ధన్ వెళ్లిన కొద్ది సేపటికే షబ్బీర్‌అలీ తన ముగ్గురు ప్రధాన అనుచరులతో కలిసి వచ్చి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గంపగోవర్ధన్‌న్‌కు కౌంటర్ సవాల్ చేశారు. నాకు ఉన్న ఆ స్తులన్ని కూడా నిబంధనల మేరకు ఇన్‌కమ్ టాక్స్ చెల్లించి ఉన్నాయని, తనకు తాతల కాలం నుండి ఆస్తులు ఉన్నాయని అన్నారు. బినామీ ఆస్తులు ఉంటే 2014 ఎన్నికల అఫ్‌డవిట్‌లో నవ్వు పెట్టిన ఆస్తులు ఒక్కసారి చూసుకో, నేను పెట్టిన ఆస్తులను చూసుకుంటే నీ సవాల్‌కు నీకే సమాధానం వస్తుందని అన్నారు. నవ్వ ఇళ్లు కట్టుకున్నావ్ అది కూడా సీఎస్‌ఐ చర్చి వారి స్థలంలో 100గజాలు మున్సిపల్‌కు వదిలిన స్థలంలో ఇంటిని కట్టుకున్నావు, ఇది నువ్వు చేసిన అక్రమం కాదా అని ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడే స్థాయిలో ఉండి నీవు చట్టాన్ని అతిక్రమించావని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఇళ్లు లేదు అని చెప్పుకుని ఓట్ల ప్రచారం చేసుకున్నావు, ఇప్పుడు ఇళ్లు, భూములు, ఎక్కడి నుండి వచ్చాయని షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. కామారెడ్డిలో ఎస్‌ఆర్‌ఎస్‌పి నుండి నీటి సౌకర్యం కల్పించిన ఘనత తనదేనని, కామారెడ్డిలో స్టేడియం, డైరీ కళాశాల, ప్రాణహిత, చేవేళ్ల నుండి 3లక్షలకు నీరు అందించామని, 22ప్యాకిజీని తెచ్చామని, ప్రతి ఎన్నికల ప్రచారంలో నేను ఎప్పుడు పేదవాన్ని అని చెప్పుకుని ఓట్లు అడగలేదని, కేవలం అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగి గెలిచిన తరువాత చెప్పిన దాని కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేశానని అన్నారు. స్వాతంత్రం రాకముందునుండి కూడా నేను ఆస్తిపరునే్న నాకు, ఇండ్లు, పొలాలు, ఆస్తుల ఉన్నాయని అన్నారు. నీవు చెప్పిన ఆస్తులన్ని ఎన్నికల ఆఫడవిట్‌లో తెలియచేయడం జరిగిందని, వాటిలో చాలా ఆస్తులు తమ పూర్వికులవేనని అన్నారు. 10సంవత్సరాలుగా అధికారంలో లేని నన్ను ఆస్తులు ఏలా అడుగుతావు, నా ఆస్తుల విషయంలో అనుమానం ఉంటే అధికారంలో ఉన్నావ్ కదా అప్పుడు ఎందుకు ఇన్‌కమ్ టాక్స్ దాడులు చేయించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా తనపై ఇన్‌కమ్ టాక్స్ దాడులు చేయించు, నా ఆస్తులు న్యాయంగా ఉన్నాయో లేదో తెలుస్తాయని సవాల్ విసిరారు. చర్చ్, వక్ఫ్‌బోర్డు ఆస్తులను అమ్మె అధికారం ఎవ్వరికి లేదని, లీజ్‌కు తీసుకోవడం తప్ప అని అన్నారు. చర్చ్ వెంచర్ స్థలంలో 100గజాల కబ్జా చేసి ఇంటిని కట్టుకున్న నీవు కా మారెడ్డి ప్రజలకు ఏం శాశ్వత అభివృద్ధిని సాధించావో చెప్పాలని సవాల్ విసిరారు. నాల్గుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నీవు శాశ్వతమైన అభివృద్ధి ఏం చేయలేదని ఆరోపిస్తూ, తాను చేసిన శాశ్వత అభివృద్ధి కామారెడ్డి ప్రజలందరికి తెలుసని అన్నారు. కామారెడ్డిలో జరిగిన కత్తిపోట్ల సంఘటనలో ఎవరి ప్రమేయం ఉందో నీవు పట్టించు నేను నిన్ను అభినందిస్తా అని అన్నారు. నేను నా అభివృద్ధి కామారెడ్డి ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. తాను ఏ సవాల్‌కైన ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అన్నారు. షబ్బీర్‌అలీ వెంట టిపీసీసీ నాయకుడు వేణుగోపాల్‌గౌడ్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్‌రావు ఉన్నారు. కామారెడ్డి చరిత్రలోనే ఇద్దరు బడా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్కుంటూ, మహాత్మాగాంధీ సాక్షిగా ఆస్తులు వెల్లడించుకోవడం చర్చనీయాంశంగా మారింది.