తెలంగాణ

సాటిలేని మెదక్ సీటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......

సంగారెడ్డి, అక్టోబర్ 11: సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించి ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఎంతో మంది రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, కీలక శాఖల్లో మంత్రులుగా పదవుల్లో కొనసాగిన వారికి మెదక్ జిల్లా కేంద్రంగా మారింది. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఈ జిల్లా ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే వచ్చిన ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గెలుపొంది సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ఇదే నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మెదక్ జిల్లాలోని రామాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన టీ.అంజయ్య సైతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన జగన్నాథరావు ఉపముఖ్యమంత్రిగా, అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన దామోదర్ రాజనర్సింహా కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించాడు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన దివంగత నేత కరణం రామచందర్‌రావు ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలక పదవులను అధిరోహించాడు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పి.రాంచంద్రారెడ్డి శాసన సభ స్పీకర్‌గా సమర్థవంతంగా పని చేసారు. సిద్దిపేట నుంచి మదన్‌మోహన్, కేసీఆర్‌లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించగా దుబ్బాక నుంచి ప్రాతినిథ్యం వహించిన చెరకు ముత్యంరెడ్డి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందాడు. అందోల్ నుంచి రాజనర్సింహ, మల్యాల రాజయ్య, బాబుమోహన్, దామోదర్‌లు ఎన్నికై మంత్రులుగా పనిచేసారు. నర్సాపూర్ నుంచి గెలుపొందిన సునితా లక్ష్మారెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీతారెడ్డి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాలో రాజకీయ బీష్ముడుగా పేరుగాంచిన బాగారెడ్డి ఉన్నతమైన మంత్రి పదవులను అదిరోహించారు. మొట్టమొదటి ఎన్నికలు మొదలుకుని 2014 ఎన్నికల వరకు ఆయా నియోజకవర్గాల నుండి బరిలోకి దిగి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర సంతరించుకుంది. డిసెంబర్ 7వ తేదీన ఉత్కంఠ భరితంగా కొనసాగే ముందస్తు ఎన్నికల పోరులో నాయకులు తమ అదృష్టాలను పరీక్షించుకోవడానికి సర్వసన్నద్దం అవుతున్నారు.