తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్‌కే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడ్, అక్టోబర్ 11: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుపొంది తెలంగాణలో అధికారంలోకి వస్తుందని నాగార్జునసాగర్ తాజా మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని మొసంగి, చేపూరు గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటగా గుర్రంపోడ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో ధరల పెంపు అడ్డూఅదుపు లేకుండా పోయిందని తెలంగాణలో అమలు చేయలేని హామీలను ముఖ్యమంత్రి గుప్పించి అమలు చెయ్యకుండానే ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా డబల్‌బెడ్‌రూం ఇల్లు, కేజీ టూ పీజీ ఉచ్చిత విద్య, దళితులకు 3 ఎకరాలవంటి భూపంపకాలు అమలుకు నోచుకొలేదని అన్నారు. దోపిడి చేసి సంపాదించిన సొమ్ముతోనే రంగారెడ్డి, నల్లగొండ, వనపర్తి సభలు నిర్వహించారని ఆ సొమ్ముని ఎన్నికల్లో ఖర్చు చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎత్తుగడలు చేస్తున్నారని అన్నారు. భగిరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లానీళ్లు ఇస్తానని ఇవ్వకుంటే ఓట్లు అడగనన్న ముఖ్యమంత్రి ఎలా ఓట్ల కోసం తీరుగుతారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధిక మెజారీటితో గెలిపించి సోనియాగాంధీ ఋణం తీర్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రూపాయల ఋణమాఫీ చేస్తుదన్నారు. ప్రతి ద్వాక్రా సంఘానికి వడ్డీ లేకుండా 10లక్షల రూపాయలు ఋణం అందజేస్తామన్నారు. 10సంవత్సరాల కాంగ్రస్ పాలనలో 70వేల కోట్ల రూపాయలు అప్పుచేస్తే 4సంవత్సరాల 3నెలల కాలంలో 2లక్షల 65వేల కోట్లు అప్పుచేసారన్నారు. ఇవ్వన్నీ ప్రజల మీద గుదీబండై కూర్చుటుందన్నారు. రానున్న ఎన్నికలల్లో యువకులు రైతులు అఖండ మెజారీటితో గెలిపించాలని అన్నారు.అనంతరం జానారెడ్డి సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ పార్టీల కార్యకర్తలు సుమారు 300మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.