తెలంగాణ

త్వరలో తెలంగాణకు మంచిరోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, అక్టోబర్ 12: త్వరలోనే తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని, ఇక్కడి కేసీ ఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 20న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు ఏ ఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ రానున్నారని తెలిపారు. 20న జరిగే భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే డిసెంబర్ మొదటి వారంలో ఇక్కడ ఎన్నికలు ఉన్నాయని, ప్రజలందరూ కాంగ్రెస్‌పార్టీ వైపే చూస్తున్నందున ఈసారి తెలంగాణలో విజయఢంకా మోగిస్తామన్నారు. అంతేకాకుండా డిసెంబర్ 2వ వారంలో టీ ఆర్ ఎస్ పాలనకు చరమగీతంపాడి కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో సైతం అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలుచేయకపోవడంతో మోడీ సర్కార్‌పై దేశ ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు జీ ఎస్టీ భారంతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌గాలి వీస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఐదేళ్లు పాలించుమని అధికారాన్ని అప్పగిస్తే పాలన చేతకాక సీ ఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేశారన్నారు. దసరా వచ్చింది.. రావణపీడ వదులుతుందన్నట్లు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పీడ వదిలిపోతుందని విమర్శించారు. టీఆర్ ఎస్ బలహీనపడడంతోనే కేసీఆర్ లో అసహనం పెరిగి ప్రతిపక్షాలపై దూషణలకు దిగుతున్నారన్నారు.