తెలంగాణ

కేసీఆర్ అబద్దాలకోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 12: అబద్దాల కోరు కేసీఆర్ అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత వి.హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లాలో ఇందిరాగాంధీ రథయాత్ర ప్రారంభంలో భాగంగా జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి ఆ రథయాత్ర మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంది. హన్మంతరావు రథయాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకడమే కాకుండా భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. మెదక్ రాందాస్ చౌరస్తాలో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హన్మంతరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన మహేందర్‌రెడ్డిని క్యాబినెట్‌లో కేసీఆర్ ఎందుకు చేర్చుకున్నారని, తుమ్మల నాగేశ్వర్‌రావును పార్టీలో ఎందుకు చేరుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నీవు ప్రతివ్రతవా అని కేసీఆర్‌ను ఉద్దేశించి హన్మంతరావు ధీటుగా విమర్శించారు. మహా కూటమిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్న ప్రగల్భాలను ఆయన ఖండించారు. నెహ్రు కుంటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిందన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ విషయంలో కేసీఆర్ ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద పోసుకుంటానని చెప్పిన ఆయన సోనియగాంధీ కుటుంభంపై తిట్ల వర్షం కురిపిస్తున్నారని ఆరోపించారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేశావా అని ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదుకదా, అన్నప్పుడు ఏ విధంగా ముస్లీంలను మోసం చేస్తున్నావని ఆయన తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు, బెడ్‌రూమ్‌లు, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టీ పీజీ అనే అంశాలపై ఎలాంటి దాఖలాలు లేవని హన్మంతరావు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. దొరల పాలన పోవాలని ఆయన ప్రజలను కోరారు. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ది చేశారన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ గుర్తు హస్తానికి ఓటు వేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ బ్యాంక్‌లను జాతీయం చేసింది. నిరుపేదలకు భూమి ఇచ్చింది, అలాంటి కుటుంభానికి మనం అవకాశం ఇచ్చి ఈ దొరల పాలనను అంతమోందించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సర్వే వారిని గెలిపించాలని ఆయన కోరారు.