తెలంగాణ

కూప్పుకూలిన కాంగ్రెస్ ఎన్నికల సభా వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 12: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ప్రచారంలో అపశృతి నెలకొంది. బహిరంగ సభ వేదిక కుప్పకూలింది. విజయశాంతి ప్రసంగిస్తుడంగా ఒక్కసారిగా స్టేజీ కూలడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం నుండి విజయశాంతి, భట్టి విక్రమార్కలు భయటపడ్డారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ భట్టివిక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ మంత్రి డికె అరుణలు పాల్గొన్నారు. అయితే కొల్లాపూర్ రోడ్‌షో ముగించుకుని అచ్చంపేటకు చేరుకున్న ప్రచారయాత్ర బహిరంగ సభ వెదిక దగ్గరకు భట్టివిక్రమార్క, విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్టలు వెళ్లారు. నాయకులు సభావేదికపైకి రాగానే ఒక్కసారిగా వేదికపైకి చాలామంది నాయకులు ఎక్కడంతో అకస్మత్తుగా వేదిక కూప్పకూలింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు విజయశాంతిని, భట్టి విక్రమార్కను కుప్పకూలిన వేదిక ప్రాంతం నుండి భయటకు తీసుకువచ్చారు. సభా వేదిక కూలుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రజలు పెద్దగా కేకలు వేస్తూ భయబ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపు అందరిలో ఆందోళన నెలకొంది. కాగా వేదిక కూలినప్పటికిని ఎవరికి కూడా ఎలాంటి దెబ్బలు తగలకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఎన్నికల ప్రచార రథంపై నుండి నేతలు తమ ప్రసంగాలను మళ్లీ కొనసాగించారు.