తెలంగాణ

‘దేశం’ కనుమరుగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 13 : తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాలుప్రసాద్ యాదవ్ పార్టీ అక్కడ కనుమరుగైందని చెప్పారు. జార్ఖండ్ ప్రజలు ఆపార్టీని బీహార్ పార్టీగా ముద్ర వేశారన్నారు. నేడు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాపార్టీగా ముద్రపడిందని పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు అపర్ణ, మాజీ కౌన్సిలర్ రాందాస్‌తో పాటు, నియోజక వర్గానికి చెందిన మూడు మండలాల అధ్యక్షులు, 300 మంది కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీష్‌రావు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చెస్తే టీడీపీ అడ్రస్ గల్లంతయిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముసుగులో చంద్రబాబు తెలంగాణాలో కాలుపెట్టి ఉనికిని కాపాడుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వస్తే నాగర్జున సాగర్‌పై 45 టీఎంసీల హక్కు తెలంగాణకు కల్పించ బడుతున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిందన్నారు. నాగర్జున సాగర్‌కు 45టీఎంసీల నీరుపై చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారన్నారు. కృష్ణాబోర్డు, ఢిల్లీ, అపెక్స్ కమిటీలు తెల్చీ చెప్పిన చంద్రబాబు అడ్డుకుంటున్నారని అందుకే ఆంధ్రాబాబు అంటున్నట్లు పేర్కొన్నారు. తొండి చేసిన టీడీపీతో కాంగ్రెస్ ఏలా జత కడుతుందని ప్రశ్నించారు. నోటీతో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరిస్తున్నట్లు చంద్రబాబు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసిన పార్టీలను తెలంగాణ ద్రోహులు అంటున్నట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు డీజైన్ మార్చాలని లేని పక్షంలో భద్రాచలం రాముడి గుడి మునిగిపొతుందని కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారన్నారు. ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈవషయంపై తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రాతిపదికన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చుకున్నారో స్పష్టం చేయాలన్నారు. అపవిత్ర పొత్తులు పెట్టుకుంటున్న మహాకూటమికి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిందన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు సరైన గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు అపర్ణ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు చెప్పారు. నియోజక వర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావుకు రికార్డు మెజార్టీ కట్టబెట్టేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి,టీఆర్‌ఎస్ రాష్టక్రార్యదర్శి రాధకిషన్‌శర్మ, కోమాండ్ల రాంచంద్రారెడ్డి, మోహన్‌లాల్, మొసర్ల మదుసూదన్‌రెడ్డి, గడీల శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, వల్లపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి,గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.