తెలంగాణ

మహాత్రిపుర సుందరిగా భద్రకాళీ అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్,అక్టోబర్ 13: చరిత్ర ప్రసిద్దిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ్భద్రకాళీ దేవాస్ధానంలోఅత్యంతవైభవంగా నిర్వహిస్తున్న దేవి శరనవరాత్రుల ఉత్సవాలు శనివారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. లలిత మహాత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజ కాగానే అమ్మవారికి నవరాత్రి విశేష సేవలు ప్రారంభమైనాయి. నాల్గవరోజు శరనవరాత్ర కార్యక్రమంలో భాగంగా అమ్మవారు లలితామహాత్రిపుర సుందరిగా అలంకరించారు. నవదుర్గా క్రమంలోనాల్గవది అయిన చంద్రఘటాదుర్గా క్రమంలోను , బోధాయన ప్రోక్తదేవపూజను అనుసరించి గిరిజా దుర్గాక్రమంలో పూజారాధనలు జరుపబడి ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనం మీద అమ్మవారిని అన్నుల పండుగగా ఊరేగించారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.