తెలంగాణ

భవానిగా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 14: చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని శ్రీ్భద్రకాళి దేవస్ధానంలో అత్యంతవైభవంగా శరనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు భవానిగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజ కాగానే అమ్మవారికి నవరాత్రి విశేష సేవలు ప్రారంభమైనాయి. ఐదవ రోజు శరనవరాత్ర కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని భవానిగా అలంకరించి చతుస్ధానార్చన జరిపారు. నవరాత్ర వ్రతంలో వరాహ పురణాంతర్గత నవదుర్గా విదానాన్ని అనుసరించి అమ్మవారికి కాత్యాయని దుర్గా క్రమంలో మరియు బోధాయన ప్రణీత ఆగమోక్త దేవపూజా విధానాన్ని అనుసరించి ధూమ్రః దుర్గా క్రమంలోను అమ్మవారికి పూజారాధనలు నిర్వహించి అమ్మవారిని పల్లకి మీద ఊరేగింపు జరిపారు. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగముండదు. ఎక్కడైతే భోగముంటుందో అక్కడ మోక్షం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగమోక్షాలు రెండూ ఉంటాయని శాస్త్రం చెపుతోంది. శంకరుడికి అమ్మవారు భవాని రూపంలో సమస్త భోగాలను ఇస్తుంది. భవాని దర్శనం చేసుకున్న భక్తులకు సమస్త భోగాలు సమకూరుతాయి. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.