తెలంగాణ

మాజీ మావోయిస్టు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, అక్టోబర్ 16: పురుగుల మందుతాగి మాజీ మావోయిస్టు గుండూరి శ్రీను అలియాస్ రమాకాంత్(45) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అంబడిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎఎస్సై అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం. వెల్దండ మండలం హజిలాపూర్ గ్రామానికి చెందిన శ్రీను అలియాస్ రమాకాంత్ మాజీ మావోయిస్టు కాగా, బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు దేవేంద్రమ్మ అలియాస్ రజితతో ఉద్యమంలో ఉన్నప్పుడే వివాహం జరిగింది. జనజీవన స్రవంతిలో భాగంగా పోలీసులకు లొంగిపోయిన వీరు కల్వకుర్తిలో చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచుగా ఇద్దరి మధ్య గొడువలు జరుగుతుండేవని, ఈ క్రమంలోనే ఆయన భార్య ఎవ్వరికి చెప్పకుండా సోమవారం ఇంటిలోనుంచి వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం వెతుకుతూ భార్య అక్క ఈశ్వరమ్మ ఊరైన మండలంలోని అంబడిపల్లి గ్రామానికి సోమవారం శ్రీను అలియాస్ రమాకాంత్ వచ్చాడు. ఇక్కడ కూడా భార్య రజిత కనిపించకపోవడంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి అంబడిపల్లిలో ఈశ్వరమ్మ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీనిని గమనించిన బంధువులు వెంటనే ఆయనను సోమవారం రాత్రి అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు శ్రీను అలియాస్ రమాకాంత్ మావోయిస్టు దళంలో చురుకుగా పాల్గొంటూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు విధ్వంసాలు, రాజకీయ నాయకుల హత్యలలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. పలు సంచలనాత్మకమైన సంఘటనలలో ప్రధాన భూమిక పోషించినట్లు పోలీసు రికార్డులలో నమోదై ఉంది. మృతుడు అన్న కుమారుడు బీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీఐ రామకృష్ణ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్సై అంజయ్య తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సొంతగ్రామమైన హజిలాపురం గ్రామానికి తీసుకొని పోయినట్లు తెలిపారు.