తెలంగాణ

గ్రామీణాభివృద్ధిపైనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ‘్భరతదేశం వ్యవసాయంపై ఆధారపడ్డ దేశం, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టవుతుంది’ అన్నారు తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన 55 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ (రాజేంద్రనగర్) లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ అండ్ పిఆర్) లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. ‘గ్రామీణభివృద్ధికి కొత్త విధానాలు-అమలు-సమీకృతాభివృద్ది లక్ష్యాలు’ అంశంపై 4 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమాన్ని మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన సొంత నియోజకవర్గంలో ‘పల్లె ప్రగతి నిద్ర’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమం గ్రామీణాభివృద్దికి దోహదపడుతోందని వెల్లడించారు. ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ డిప్యూటీ డెరెక్టర్ జనరల్ రాధికారస్తోగి మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌కు సంబంధించి తమ సంస్థ ఏటా అనేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ రాష్ట్రాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరస్పరం తెలియచేసుకునేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాలను ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. నాలుగురోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మిజోరం, ఒడిషా, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.

ప్రజా స్వరాజ్ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్, మే 8: అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలకు న్యా యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మంగళవారం ఎల్బీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షు డు కస్తూరి గోపాల కృష్ణచ, ప్రధాన కార్యదర్శి కట్టెల సుబ్బయ్య, కార్యదర్శి రాజ్‌బాబు, మాధవిలు మాట్లాడారు. అందరికీ ప్రాతినిధ్యం కల్పించేందే ప్ర జాస్వామ్యమని అయితే ప్రస్తుతం అది కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో 119 సీట్లు ఉంటే కేవలం 7శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 60 శాతం సీట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో అధికారానికి దూరమవుతున్న వర్గాలు అభివృద్ధి సాధించలేక పోతున్నాయని మండిపడ్డారు. జనాబా నిష్పత్తి ప్రకారం... బీసీలకు 65సీట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారిని పాలనలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించినట్టు చెప్పారు.