తెలంగాణ

ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 26: తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, మిగిలిపోయిన కొన్ని సమస్యలు నూతన ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ చివరిలోపు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్జీవోస్ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర కీలమైందని గుర్తించిన ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇచ్చిందని, 9మాసాల బకాయిలు కూడా పొందడం జరిగిందన్నారు. ప్రభుత్వం పీఆర్‌సీ అమలు కోసం కమిటీని వేసిందని, ఎన్నికల సందర్భంగా కమిటీ నివేదిక ఇవ్వడం వాయిద పడిందన్నారు. 63శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల కమీషన్‌ను విన్నవించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్ మాట్లాడుతూ ఉద్యోగుల ప్రెండ్లి ప్రభుత్వమని చెప్పిన కేసీఆర్ పీఆర్‌సీ రూపంలో ఉద్యోగులకు నిరాశే మిగిల్చారన్నారు. ఇప్పటికే రెండున్నర సంవత్సరాల పీఆర్‌సీని నష్టపోయామని, 11వ వేతన సవరణ సంఘం వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి పీఆర్‌సీ కాదు ఐఆర్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాటను దాట వేసారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయవంతంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని, అలాంటి ఉద్యోగులకే ఐఆర్ ఇవ్వడానికి భారంగా మారిందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది పెన్షనర్లు, 8లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వీరందరూ కోటి మందిని ప్రభావితం చేస్తారన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై ఆలోచించి మద్దతు ఇచ్చేవారు, సీపీఎస్ రద్దు చేసే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా 80శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని కొత్త ప్రభుత్వం ప్రకటించాలన్నారు.