తెలంగాణ

నోట్ల ప్రవాహం.. తనిఖీలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తాజాగా మూడుచోట్ల రూ. 2.27కోట్ల పట్టివేత
ఆదిలాబాద్,అక్టోబర్ 26: మహారాష్టక్రు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలకు ముందే డబ్బు ప్రవాహం ఏరులైపారుతోంది. ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ వ్యూహంతో చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా పెంచింది. ఈమేరకు 12 సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 19వ తేదీన జైనథ్ మండలం పిప్పర్‌వాడటోల్ ఫ్లాజా వద్ద నాగ్‌పూర్ నుండి కర్ణాటక వెళ్తున్న డస్టర్ కారును పోలీసులు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న రూ.10కోట్ల నగదు పట్టుబడడం రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించింది. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ఈ హవాల డబ్బును తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు, ఐటి అధికారులు విచారణ సాగిస్తున్నారు. నాగ్‌పూర్ కేంద్రంలో బినామీపేర్లతో లాకర్ సెంటర్లలో నిల్వ ఉంచిన డబ్బు నిల్వలపై నిఘా పెంచి ఐటి అధికారులు అక్రమ డబ్బుపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున మద్యం నిల్వలు జిల్లా సరిహద్దులు దాటి తరలివస్తున్న నేపథ్యంలో కలెక్టర్ల ఆదేశాల మేరకు ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోటి 78లక్షల 22వేల 400 రూపాయలు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొనగా వివిధ సంఘటనల్లో 537 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ రికార్డును బద్దలు కొడుతూ వారం రోజుల్లోనే వాహనాల తనిఖీల్లో భాగంగా ఐదు చోట్ల పోలీసుల తనిఖీల్లో రూ.12కోట్ల 39లక్షల 50వేల నగదు పట్టుబడడం గమనార్హం. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద ఇటీవల 2.5లక్షలు, నేరడిగొండ వద్ద రూ.2లక్షలు పట్టుబడగా తాజాగా బెల్లంపల్లి రైల్వేస్టేషన్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.2.20లక్షలు పట్టుబడగా అదే విధంగా ఉట్నూరు చెక్‌పోస్టు వద్ద సాయంత్రం పోలీసుల తనిఖీల్లో బొలెరో వాహనం నుండి లక్షా 90వేల నగదు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బిద్రెల్లి చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో నిజామాబాద్ నుండి భైంసా వస్తున్న ఓ వ్యక్తి నుండి అక్రమంగా బ్యాగులో తరలిస్తున్న రూ.2.5లక్షల నగదు పట్టుబడడం గమనార్హం. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నా నోట్ల ప్రవాహం ఆగడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి చెక్‌పోస్టు, కాగజ్‌నగర్, చెన్నూర్, కోటపల్లి కేంద్రాలతో పాటు నిర్మల్ జిల్లా బిద్రెల్లి, కుబీర్, ఆదిలాబాద్ జిల్లా పిప్పర్‌వాడ, లక్ష్మీపూర్, బేల మండలం కొబ్బాయి, ఆదిలాబాద్ మండలం సాత్నాల, బోథ్ మండలం ఘన్‌పూర్ చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘాతో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలింపుపై నిఘా పెంచారు. ఎన్నికల నేపథ్యంలో ఏలాంటి లెక్కపత్రం లేకుండానే హవాల డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్న సంఘటన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.