తెలంగాణ

భారత్, జపాన్ విద్యా సంబంధాలకు వేదిక ఐఐటీహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ యేడాది అధికంగా 30 మంది విద్యార్థులకు * 7వ అకడమిక్ పెయిర్‌లో వెల్లడించిన అధికారులు
సంగారెడ్డి, అక్టోబర్ 26: భారత్, జపాన్ దేశాల మధ్య విద్యా వ్యవస్థలో సన్నిహిత సంబంధాలు దీర్ఘకాలం కొనసాగేందుకు ఐఐటీ హైదరాబాద్ సంస్థ వేదికగా నిలుస్తోందని జపాన్ సొసైటీ పర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్ (జేఎస్ పీఎస్) మాజీ అధ్యక్షుడు డాక్టర్ యుచిరో అంజాయ్ వెల్లడించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ సంస్థలో 7వ ఐఐటీ హైదరాబాద్-జపాన్ కొలాబ్రేషన్ అకడమిక్ ఫెయిర్ సందర్భంగా జపాన్‌లో విద్యాభ్యాసానికి 30 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తున్నట్లు జీకా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌లో విద్యాభివృద్ధికిగాను అఫిషీయల్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ ద్వారా రూ.1300 కోట్ల ఆర్థిక రుణ సహకారం అందించినట్లు వెల్లడించారు. 2012 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 91 మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేసినట్లు తెలిపారు. 20 మంది మాస్టర్స్, 71 మంది పీహెచ్‌డీ విద్యార్థులు లబ్దిపొందారన్నారు. జపాన్‌లో 14 విభిన్న యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం కోసం ఈ స్కాలర్‌షిప్‌లు దోహదపడ్డాయన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జపాన్‌లోని పలు కంపెనీల్లో, ఎంతో ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీల్లో పరిశోదన సంస్థలో చేరినట్లు వెల్లడించారు. జపాన్ ఇంటర్నేషనల్ కొలాబ్రేషన్ ఏజెన్సీ (జీకా) ప్రెండిషిప్ ప్రాజెక్టు క్రింద 7వ ఐఐటీ హైదరాబాద్, జపాన్ కొలాబ్రేషన్ అకడమిక్ పెయిర్‌ను నిర్వహించినట్లు స్పష్టం చేసారు. స్కాలర్ షిప్‌లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, హొక్కైడొ యూనివర్సిటీ, కియో యూనివర్సిటీ, హిరోషిమా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక జపాన్ విశ్వవిద్యాలయాల అద్యాపకులు, సిబ్బంది ఐఐటీహెచ్ గ్రాడ్యుయేట్స్, కాబోయే గ్రాడ్యుయేట్స్‌ను తమ మాస్టర్ డాక్టొరల్ ప్రొగ్రామ్స్‌లో చేర్చుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. జికా అందించే సహాయం, ఇంటర్నేషనల్ గెస్ట్‌హౌజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్, టెక్నాలజీ అండ్ ఇంక్యుబేషన్ పార్క్, కనె్వన్షన్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్, నాలెడ్జ్ సెంటర్‌ల అభివద్ధికి హై ఎండ్ లేబొరేటరి పుకరణాలను సమకూర్చుకునేందుకు ఆర్థిక సహాయం తోడ్పాటును అందిస్తుందన్నారు. రెండు దేశాలకు ఐఐటీహెచ్ ఒక ప్రత్యేక స్థలంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఐఐటీహెచ్ విద్యార్థులు జికా తోడ్పాటును సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ యూబి. దేశాయ్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.