తెలంగాణ

ఓటమి అంచున టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెలంగాణలో కాషాయజెండా ఎగరడం ఖాయం * మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
సూర్యాపేట, అక్టోబర్ 26: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలుచేయకుండా అన్ని వర్గాల ప్రజల విశ్వాసం కొల్పోయిన టీఆర్‌ఎస్.. ముందస్తుకు సిద్ధపడినప్పటికీ తీవ్ర ప్రజావ్యతిరేకత కారణంగా ఓటమి అంచుల్లో ఉందని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అమలు సాధ్యం కాని హమీలనిచ్చి.. అమలుచేయలేని సీఎంగా కేసీఆర్ మిగిలారని విమర్శించారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూపంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామంటూ 125 రకాల వాగ్దానాలు చేసి వేటిని అమలుచేయలేదన్నారు. అన్నిరంగాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని రైతులు, మహిళలు, బీసీలు, అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుందన్నారు. ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ క్యాడర్‌లో నిరాశ, నిస్పృహలు వెంటాడుతున్నాయన్నారు. ముందస్తు తమను ముంచుతుందని అధికార పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారన్నారు. ప్రగతిభవన్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియకుండా అంతా గులాబీమయంగా కన్పిస్తుందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి లాభిస్తుందన్నారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌కు ప్రజావిశ్వాసం లేదన్నారు. మహాకూటమి మయాకూటమిగా మారిందని, ఈ కూటమి నాయకులు ప్రజల్లో కన్పించకుండా హైదరాబాద్‌కే పరిమితమై ఇంకా సీట్ల కోసం వెంపర్లాడున్నారని విమర్శించారు. కోదండరామ్ కొన్ని సీట్ల కోసం దాసోహం కావడం తెలంగాణకు అవమానకరమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు మార్పు దిశగా సాగుతున్నాయని, వీటిని అనుకూలంగా మల్చుకొని ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా రూపాంతరం చెందుతామన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగి సత్తా చాటి తెలంగాణపై కాషాయజెండాను ఎగురవేస్తామని జోస్యం చెప్పారు. రాఫేల్ కుంభకోణం పేరుతో రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారన్నారు.
దేశంలో అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీనన్నారు. బీజేపీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను నవంబర్ 2వవారంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధానమంత్రి మోదీని విమర్శించే నైతికహక్కులేదన్నారు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అపవిత్రమన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొంటారని, నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత ఆయన పర్యటన ఉంటుందన్నారు. మోదీ సభల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయన్నారు.