తెలంగాణ

ఎన్ని కోట్లు వెదజల్లినా గెలుపు నాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మంత్రి పదవిని సైతం త్యజించి ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాడిన తనపై నల్లగొండలో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కంచర్ల భూపాల్‌రెడ్డిని పోటీ పెట్టి గెలిపించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పకొడుతారని మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం, పార్టీలో చేరికల సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని గ్రహించిన కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కోట్లాది రూపాయలు పంపిస్తున్నారని ఆరోపించారు. నల్లగొండలో తనను ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం విపరీతంగా డబ్బు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా నల్లగొండ ప్రజలు తనను ఐదోసారి భారీ మెజార్టీ గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధంగా ఉన్నారన్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను ఇరవై ఏళ్లుగా చేసిన అభివృద్ధి మినహా టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిందేమి లేదన్నారు. గత ప్రభుత్వాల సహకారంతో సాధించిన కృష్ణా సాగు, తాగు జలాలు, సబ్ స్టేషన్లు, రోడ్లు, బ్రిడ్జీలు, వౌలిక వసతుల కల్పన మినహా టీఆర్‌ఎస్ కొత్తగా ఒక్క పని చేయలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలకు ప్రజల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. కేసీఆర్ గత ఎన్నికల్లో చెప్పిన నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాట కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లతో గాలిలో కలిసిపోయిందని, మిషన్ భగీరథలో పైప్‌లు తప్ప నీళ్లు రాలేదని కోమటిరెడ్డి విమర్శించారు. లక్ష ఉద్యోగాల హామీ అమలు కాలేదని, మూడెకరాల భూమి, ఎస్టీ, మైనార్టీలకు పనె్నండు శాతం రిజర్వేషన్లంటూ మోసం చేశారన్నారు. ముందస్తు ఎన్నికల్లో ప్రజలకు టీఆర్‌ఎస్ చెప్పుకోవడానికి ఏమీ లేక నిస్సిగ్గుగా కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీకొట్టారన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి, అప్రజాస్వామిక పాలనతో విసుగెత్తిన ప్రజలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి తమ రాజకీయ చైతన్యాన్ని చాటుతారన్నారు. సమావేశంలో జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, మోహన్‌రెడ్డి, లక్ష్మయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.