తెలంగాణ

తగ్గిన జీఓల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణ ప్రభుత్వం తరఫున విడుదలవుతున్న జీఓల సంఖ్య గణనీయంగా తగ్గింది.
కేసీఆర్ ప్రభుత్వం కొనసాగినంత వరకు రోజూ సగటున 50 జీఓల వరకు జారీ అయ్యేవి. ప్రస్తుతం ఐదు నుంచి 10 వరకు మాత్రమే జీఓలు జారీ అవుతున్నాయి. అసెంబ్లీ రద్దు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రివర్గం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతోంది. ఆపద్ధర్మ మంత్రివర్గం పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకునేందుకు వీలులేదు.
అందుకే పరిపాలనాపరంగా జారీ అయ్యే జీఓలు విడుదల కావడం లేదు. ప్రస్తుతం పరిమితమైన అంశాల్లోనే జీఓలు జారీ అవుతున్నాయి. 2018-19 సంవత్సరానికి కేటాయించిన నిధులకు సంబంధించి విడుదల చేస్తున్న నిధుల జీఓలు, రోజువారీ పనులు, కార్యక్రమాలకు సంబంధించిన జీఓలు మాత్రమే జారీ అవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన జీఓలే ఎక్కువగా ఉంటున్నాయి.