తెలంగాణ

ఎన్‌ఐఆర్‌డీలో వార్షిక ఫిల్మ్‌ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: గ్రామీణాభివృద్ధి ఇతివృత్తంగా రూపొందించిన సినిమాల ప్రదర్శన కోసం 2018 నవంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ సంస్థలో మూడో వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఆర్‌డిలోని వికాస్ ఆడిటోరియంలో చిత్ర ప్రదర్శన ఉంటుంది. గ్రామీణాభివృద్ధికి అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సామాజిక అంశాలు, గ్రామాల్లో సాంకేతికాభివృద్ధి వినియోగం, కొత్త కోణాల్లో గ్రామాలను చూపించడం తదితర అంశాల్లో రూపొందించిన సినిమాలకు ఈ ఉత్సవాల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 2018 నవంబర్ 5 వరకు ఎంట్రీలను పంపించేందుకు అవకాశం ఉన్నట్టు ఎన్‌ఐఆర్‌డీ అండ్ పీఆర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్‌ను 2016 నుండి నిర్వహిస్తున్నారు.

జంటనగరాల్లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయండి
* హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 30: హైదరాబాద్ జంటనగరాల్లో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం పోలీస్ శాఖను ఆదేశించింది. వాహన శబ్ధాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యలతో పాటు అనవసరంగా హారన్‌లను మోగించడం, చిన్నారులు డైవింగ్ చేయడం వంటి అంశాలపై ట్రాఫిక్ పోలీసులు కటినంగా వ్యవహరించాలని, అలాగే రోడ్డు దాటే సమయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో కూడా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.