తెలంగాణ

ఐపీఎల్ టికెట్లలో చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 8: హైదరాబాద్ ఉప్పల్‌లో సోమవారం జరిగిన ఐపీల్ మ్యాచ్‌కు సంబంధించిన క్రికెట్ టిక్కెట్లలో మోసానికి పాల్పడుతున్న యాంటీ అంబుష్ టీం ఉద్యోగిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. అక్కడ ఉద్యోగిగా ఉంటూ నాలుగు కాసులు సంపాధించాలన్న ఆశతో తన చేతివాటాన్ని ప్రదర్శించబోయి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్ డబీర్‌పురా నూర్‌ఖాన్ బజార్‌లో నివసిస్తున్న సయ్య ద్ అఫ్తాబ్ హుస్సేన్ కజ్మీ (23) విద్యార్థి. అతడు క్రికెట్ టిక్కెట్లకు సంబంధించిన ఈవెంట్ ఆధీనంలో ఉన్న యాంటీ అంబుష్ టీంలో రెండేళ్లుగా పని చేస్తున్నా డు. కంపెనీ తరపున జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలోక్రికెట్ మ్యాచ్ రోజున స్టేడియం వద్ద టికె ట్లు స్కాన్ చేసే పనిని అప్పగించారు. సోమవారం స్టేడియంలో బెంగళూరు రాయల్ చాలెంజ్-హైదరాబాద్ సన్‌రైజర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గేట్ నెం బర్ 8 టంగ్ స్టైల్ స్కానింగ్ యంత్రం వద్ద విధులు నిర్వహిస్తున్న అతడు మ్యాచ్ కోసం వచ్చిన వారి నుం చి టికెట్లు తీసుకుని స్కాన్ చేసి వారికి బార్ కోడ్ ఉన్న పెద్ద టికెట్ అతని వద్దే పెట్టుకుని చింపిన చిన్న టిక్కెట్ ఇచ్చి వారిని లోపలికి పంపించారు. మళ్లీ వచ్చిన స్పెక్టేటర్ వద్ద టిక్కెట్ తీసుకుని స్కాన్ చేయకుండా చింపకుండా తన వద్దనే పెట్టుకుని తన వద్ద ఉన్న కంపెనీ ఈవెంట్ వారు ఇచ్చిన యాక్సెస్ ఐడీ కా ర్డు ద్వారా స్కాన్ చేసి స్పెక్టేటర్‌కి చింపిన పాత టిక్కెట్ ఇచ్చి లో పలికి పంపిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్ర తిసారి ఇదే తరహాలో మోసం అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ తప్పించుకుంటున్నాడు. అతని వద్ద రూ. 15వేలు స్వాధీనం చేసుకుని మంగళవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు.