తెలంగాణ

టీఆర్‌ఎస్ హయాంలోనే మైనార్టీలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, అక్టోబర్ 30: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించిందని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల కింగ్స్ గార్డెన్‌లో ఆశీర్వాద మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి, మాట నిలబెట్టుకున్న ఎకైక సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకుల పాఠశాలలు, షాదీఖానాలు, ఖబరస్తాన్‌లు, మసీద్‌లకు లెక్కలేనన్ని నిధులు ఇచ్చారని అన్నారు. ముఖ్యంగా పేద ముస్లింల కోసం షాదీముబారక్‌తో పాటు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.