తెలంగాణ

14 లక్షల కౌలు రైతులకు రైతుబంధు లేదు: పొన్నాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు పథకం లభించలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. పోడు భూములు, దేవాదాయ భూముల్లో వ్యవసాయం చేసే లక్ష మందికీ ఈ పథకం వర్తించలేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 20 వేల రేషన్ డీలర్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదని ఆయన విమర్శించారు. రెండు లక్షల ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. రెండున్నర లక్షల కుటుంబాలకు పెన్షన్లు రద్దు చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఐదు లక్షల మందికి ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని, వడ్డీ తీర్చలేని కేసీఆర్ తమ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పొన్నాల విమర్శించారు.

4న 18 బీసీ సంఘాల సింహగర్జన: కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్ 30: బీసీల సమస్యల పరిష్కారం, ముఖ్యమైన డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 4న ‘బీసీల సింహ గర్జన’ నిర్వహించేందుకు 18 బీసీ సంఘాలు సమాయత్తమైనట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, 20 వేల కోట్ల బీసీ సబ్-ప్లాన్ పెట్టాలని కళాశాల విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సింహ గర్జన మహా సభ నిర్వహించనున్నట్లు కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజాం కళాశాల మైదానంలో తాము సింహ గర్జన నిర్వహించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. దీనికి యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇచ్చినా, పోలీసులు అనుమతించడం లేదని ఆయన వివరించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అవినీతి ఆణిముత్యాలు కేటీఆర్, కవిత: నర్సిరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణలోని ప్రాజెక్టులను చంద్రబాబునాయుడు లేఖల ద్వారా అడ్డుపడుతున్నారని పదే పదే చెబుతూ ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తున్న హరీష్‌రావు తెలంగాణలో ఏ ప్రాజెక్టు చంద్రబాబు కారణంగా ఆగిపోయిందో సమాధానం చెప్పాలని టీటీడీపీ ప్రధానకార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా పరిష్కారం చేసుకుంటారని అంతే తప్ప రాద్దాంతాలు చేసి రాజకీయాలు చేసి ప్రయోజనం పొందాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నదిపై ఎగువ రాష్టమ్రైన మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు ఆపివేయాలని, కృష్ణానదిపై ఎత్తు పెంపు నిలిపివేయాలని అనేక లేఖలను తెలంగాణ ప్రభుత్వం రాస్తే నిలిపివేశారా అని ప్రశ్నించారు.నదీ జలాలు ఏ ఒక్క రాష్ట్రం ఆస్తి కాదని, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాల కోసం జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్స్, జలవనరుల సంఘం, కమిటీలు, కోర్టులూ ఉన్నాయని, వాటికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రీ డిజైన్ చేసి టెండర్లు పిలిచి, శంకుస్థాపన చేసినపుడు గానీ అర్ధరాత్రి పూట ప్రాజెక్టుల దగ్గర పడుకున్నపుడు గానీ చంద్రబాబు అడ్డుకుంటున్నట్టు గుర్తుకు రాలేదా అని నిలదీశారు..కలెక్షన్ కింగ్ కేసీఆర్ అని, ఆయన అవినీతి ఆణిముత్యాలే కేటీఆర్, కవిత అని నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబానికి త్రీడీ సినిమా చూపించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని , అంతర్ రాష్ట్రాల వరకూ వసూళ్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన చరిత్ర కేటీఆర్‌దని ఆయన ఆరోపించారు.