తెలంగాణ

చెల్లించిన ఫీజులకు ఇంటర్‌బోర్డుదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించిన ఫీజులకు బోర్డు బాధ్యత తీసుకుంటుందని కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ ఫీజులకు సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావల్సిన పనే్లదని, బోర్డుకు ఫీజులు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు చెల్లించిన పరీక్ష ఫీజులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి బాధ్యత వహిస్తుందని చెప్పారు. ఈ నెల 31లోగా అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ ఫీజులను నిస్సందేహంగా చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ఫీజుల చెల్లింపులో ఉన్న సాంకేతిక సమస్యలను తొలగించామని అన్నారు.

యూజీ కోర్సుల్లో ప్రవేశాలు
మూడేళ్ల యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ పేర్కొంది. వర్శిటీ లిబరల్ స్టడీస్ డైరెక్టర్ వేణు నారాయణ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ డిసెంబర్ 5 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, డిసెంబర్ 16న ప్రవేశపరీక్ష ఉంటుందని అన్నారు. ఇంటర్వ్యూలు జనవరిలో ఉంటాయని, రెగ్యులర్ అడ్మిషన్లు ఏప్రిల్‌తో ముగుస్తాయని చెప్పారు. అడ్మిషన్లకు సాట్ స్కోర్ కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇతర వివరాలకు అజీంప్రేమ్‌జీ యూనివర్శిటీ డాట్ ఈడీయూ డాట్ ఇన్ అనే వెబ్‌పోర్టల్ సందర్శించాలని సూచించారు. బిఎస్సీ ఫిజిక్స్ బయాలజీ, మాథ్స్ , బిఏ ఎకనామిక్స్ కోర్సుల్లో ఈ అడ్మిషన్లు చేపడుతున్నట్టు చెప్పారు.