తెలంగాణ

చంద్రబాబుతో పొత్తు అంటే తెలంగాణకు ద్రోహమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 30 : కాంగ్రెస్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవటం అంటే.. తెలంగాణకు ద్రోహం చేయడమేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ సొంతంగా గెలిచే సత్తా లేక చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం పొత్తు కలుస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్సాన్‌పల్లి, తడ్కపల్లి నుండి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల నుండి 500 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్‌రావు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వనించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఆంధ్ర పెత్తనం వద్దని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు రాబోతున్నాయన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని, ప్రజలే తగిన గుణపాఠం చెపుతారన్నారు. ఏ చంద్రబాబు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందో... అదే చంద్రబాబు ముందు నేడు పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి చేతులు కట్టుకొని నిలబడుతున్నారన్నారు. ఇది తెలంగాణ అమరులకు అవమానపర్చటమే అన్నారు. పోరాటాల గడ్డ సిద్దిపేట.. మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందన్నారు. సిద్దిపేటలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే డిల్లీకి పొతుందని, టీడీపీకి వేస్తే అమరావతికి పొతుందని, టీజేఎస్‌కు వేస్తే ఏటు కాకుండు పోతుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి పరంపర కొనసాగుతుందన్నారు. ఎంతమంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరితే అంత బాధ్యత పెరుగుతుందన్నారు. సిద్దిపేట 500 ఎకరాల్లో పారిశ్రామికాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటించినట్లు తెలిపారు. రైతుల తన కాళ్లమీద తాము నిలబడేలా వ్యవసాయం లాభాసాటీగా చేసినట్లు తెలిపారు. ఉద్యమంలో అభివృద్ధిలో ముందున్నా సిద్దిపేట మెజార్టీలో నెంబర్‌వన్‌గా నిలువాలని మంత్రి ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమంలో అన్నిటిలో సిద్దిపేట ముందుంటుందన్నారు. మహానగరాలకు ఉండే అన్ని వసతులు, సౌకర్యాలు సిద్దిపేటకు కల్పించినట్లు పేర్కొన్నారు. దశాబ్దాల కల సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ నేరవేర్చాడన్నారు. సిద్దిపేటకు త్వరలో రైలు వస్తుందని, రెండు జాతీయ రహాదారులు మంజూరైనాయన్నారు.