తెలంగాణ

రేవంత్ రెడ్డి అనే నేను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ‘రేవంత్ అనే నేను.. ఒక నాయకుడిని, ముఖ్యమంత్రి కావడమే నా లక్ష్యం, చెప్పింది చేయ ను, నాకు నచ్చిందే చేస్తా..’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తూర్పార బట్టారు. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అనేక సంచలన వ్యాఖ్యలు చేశా రు. ముఖ్యంగా పీసీసీ నాయకత్వం పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అవసరం లేదన్నారు. అయితే తనను పార్టీలో సరిగ్గా ఉపయోగించుకోకపోతే పార్టీకే నష్టమని అన్నా రు. తన పనితీరు తెలిసి కూడా టీం లీడర్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేసిన తర్వాత దీక్ష చేయాల్సిందిగా వారికి తానే సూచించానని ఆయన ఉదాహరణగా చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి నా, కోర్టును ఆశ్రయించడంలో నాయకత్వం విఫలమైందని విమర్శించారు. తనకు వయస్సు ఉందని, తిరిగే ఓపి కా ఉందని అన్నారు. తనకు హోదాకు తగ్గట్లు పదవి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కా వడం అనేది తన లక్ష్యమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా, భవిష్యత్తులోనైనా అవుతానని ఆయన ధీమాగా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి కూడా తీసుకోనని అన్నారు. తన కేసు విషయాన్ని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ముందే చెప్పానని, ఇప్పుడు ఎవరు ఏమీ అనుకున్నా తనకు సంబంధం లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిలాంటి డైనమిక్ నాయకుడే తనను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా, తాను లొంగలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తనకు ఎన్నో ఆకర్షణలు చెప్పినా, వినిపించుకోలేదని అన్నారు. తనకు కాంగ్రెస్సే సరైన వేదిక అని భావించి చేరానని ఆయన చెప్పారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోగానీ, ఆ పార్టీ నాయకులతో గానీ ఎటువంటి విభేదాలు లేవని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఉడత ఊపులకు భయపడం..
హైదరాబాద్, మే 8: ‘ఉడత ఊపులకు భయపడం..’ అని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎసిబి అధికారులతో ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రధాని మోదీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నారని, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను టార్గెట్ చేశారని ఆయన అన్నారు. అయితే ఈ ఉడత ఊపులకు భయపడమని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసు కోర్టు పరిథిలో ఉన్నందున, తాను మాట్లాడడం బాగుండదని అన్నారు. కోర్టు తీర్పుతో ఎవరికి ప్రమేయం ఉంది, చోర్ ఎవరు? సుపారీ ఎవరు చేశారు? అనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. లంచం ఎవరు అడిగినా తనకు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి అన్నారని, లంచం అడిగితే చెప్పుతో కొట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు. తండ్రి-కుమారుడు బాగానే చెప్పారు. కానీ తెలంగాణలో 2016 సంవత్సరంలో 125 మందిపై నమోదైన ఎసిబి కేసులకు సంబంధించి సరైన సమాచారం లేదంటూ కేసులు ఉపసంహరించారని ఆయన తెలిపారు. అవినీతిపరులను కాపాడడంతో తెలంగాణ దేశంలోనే ముందు ఉన్నదని ఆయన విమర్శించారు. ‘నిమ్స్’ ఒక విభాగ అధిపతి శేషగిరి రావుపై అవినీతి కేసు నమోదైనా, కేసీఆర్ బంధువు కాబట్టే తప్పించారని ఆయన తెలిపారు. మరో బంధువు సంజీవ రావు ఎసిపి కూకట్‌పల్లి అధికారి కోట్ల రూపాయల అవినీతి చేసిన కేసును కూడా తప్పించి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన వారు ఎంత అవినీతి చేసినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు పోరాడుతుంటే కేసీఆర్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. వివిధ పార్టీలను కలుపుకుని ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కేసీఆర్ శివసేన పార్టీని ఎందుకు సంప్రదించలేదని ఆయన ప్రశ్నించారు.