తెలంగాణ

అపెక్స్ కమిటీ అనుమతిలేని ప్రాజెక్టును ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: రాజోలిబండా డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డిఎస్), సుంకేసుల బ్యారేజికి మధ్య నిర్మించే పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కేంద్రానికి బుధవారం లేఖ రాశారు. అపెక్స్ కమిటీ అనుమతి లేని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలా అనుమతి ఇస్తారని జోషి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లాకు 40 టీఎంసీల నీటిని తరలించడానికి చేపట్టిన ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యుపి సింగ్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. తుంగభద్ర డ్యామ్ ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ మూడు రాష్ట్రాలకు నీటిని అందించే అంతరాష్ట్ర ప్రాజెక్టు అని జోషి తన లేఖలో పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఆర్డీఎస్ ప్రాజెక్టుకు నేరుగా నీటిని అందించడమే కాకుండా కృష్ణానదిపై ఆధారపడిన మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, ఏలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, హైదరాబాద్ మంచినీటి సరఫరా పథకాలకు పరోక్షంగా నీటిని అందిస్తోందన్నారు. తుంగభద్ర జలాల ఆధారంగా కొత్త ఎత్తిపోతలకు అనుమతించడం వల్ల ఆ ప్రభావం తెలంగాణలోని ప్రాజెక్టులపై పడుతుందని జోషి గుర్తు చేశారు. కృష్ణానదీ యాజమాన్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా కొత్త ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేని ఎత్తిపోతల పనులను వెంటనే నిలివేయాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖను జోషి కోరారు.