తెలంగాణ

కూటమిలో కొలిక్కిరాని పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 31 : సిద్దిపేట జిల్లాలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాకపోవటంతో.. అభ్యర్థులను ఖరారు చేయకపోవటంతో వివిధ పార్టీల నుండి టికెట్లు ఆశీస్తున్న నేతల్లో తీవ్ర ఆయోమయం నెలకొంది. నోటీఫికేషన్ వెలువడి మూడువారాలు కావస్తున్న టికెట్ల ఖరారుపై ఏలాంటి స్పష్టత లేకపోవటంతో వివిధ పార్టీల నుండి టికెట్ ఆశీస్తున్న ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక నాలుగు నియోజక వర్గాలున్నాయి. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకో అసెంబ్లీ రద్దు చేసి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. జిల్లా పరిధిలో సిద్దిపేట నుండి హరీష్‌రావు, దుబ్బాక రామలింగారెడ్డి, హుస్నాబాద్ సతీష్‌కుమార్ అభ్యర్థులుగా ఖరారు చేసి, గజ్వేల్ నియోజక వర్గం నుండి కేసీఆర్ తాను స్వయంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత నెల సెప్టెంబర్ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించి ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. జిల్లాలో సిద్దిపేట నుండి కేసీఆర్, దుబ్బాక నుండి రామలింగారెడ్డి, హుస్నాబాద్ నియోజక వర్గంలో సతీష్‌బాబులు ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. గజ్వేల్ నియోజక వర్గం నుండి కేసీఆర్‌కు మద్దతుగా మంత్రి హరీష్‌రావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసిబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో మంత్రి హరీష్‌రావుకు మద్దతుగా నియోజక వర్గంలోని 25 గ్రామాలు, పట్టణంలోని వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే మద్దతు ప్రకటించి, ఏకగ్రీవ తీర్మాణాలు చేసి తీర్మాన పత్రాలను మంత్రి హరీష్‌రావుకు అందచేశారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీలు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా జెండా పండుగతో పాటు, ఇంటింటీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో ఇప్పటికే 100కు పైగా గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్‌బాబు ప్రచారం నిర్వహించారు. దుబ్బాక రామలింగారెడ్డి సైతం నియోజక వర్గం పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ప్రత్యర్థి పార్టీల టికెట్ల ఖరారు కాకముందే తమ దైన శైలిలో ప్రచారంలో దూసుకపోతున్నారు. మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజ వర్గాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.