తెలంగాణ

గురుకులాల సెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సెట్ ఫలితాలను సంస్థ కన్వీనర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం 61,580 మంది బాలురు, 55,205 మంది బాలికలు పరీక్షలకు హాజరయ్యారు. ఎస్సీలు 38,454 మంది, ఎస్టీలు 24612 మంది, బీసీలు 59,412 మంది పరీక్ష రాశారని చెప్పారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 232 సంస్థలున్నాయని, అందులో 18,560 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 88 ఉండగా, అందులో 6980 సీట్లు, రెగ్యులర్ గురుకులాలు 35 ఉండగా అందులో 2840 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ పాఠశాలలు 142 ఉన్నాయని, అందులో 11320 సీట్లు ఉన్నాయని చెప్పారు. కొమరంభీం జిల్లాకు చెందిన ఎం శశాంక్ 100కు 95 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారని, వనపర్తికి చెందిన యు. హైమావతి 94 మార్కులు సాధించి రెండోస్థానంలో, 92 మార్కులతో ఎల్ వైశాలి మూడోస్థానంలో, 92 మార్కులతో కే కృష్ణప్రసాద్ నాలుగోస్థానంలో నిలిచారని అన్నారు. ఐదో తరగతిలో 39700 మందికి అడ్మిషన్లు ఇస్తామని అన్నారు. వివిధ పాఠశాలలకు ఎంపికైన వారికి మే 10వ తేదీలోగా నేరుగా సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్ నుండి సమాచారం అందుతుందని కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగా వేరొక ప్రకటన విడుదల చేస్తూ బ్రిటిష్ మంత్రి మార్క్ ఫీల్డ్సు కామదానంలోని సాంఘిక గురుకుల పాఠశాలను సందర్శించినట్టు ఆయన పేర్కొన్నారు.
పీఈసెట్ కేంద్రం మార్పు
పీఈసెట్ కేంద్రాన్ని మార్పు చేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ వీ సత్యనారాయణ తెలిపారు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిర్వహించాల్సిన పిఇసెట్ శారీరక దారుఢ్య పరీక్షలను ఎంఎంఆర్ కాలే జీ తంగడపల్లిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇతర అనుమానాలుంటే సెట్ కమిటీ నుండి సమాచారం పొందవచ్చని చెప్పారు.
ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా న్యాక్‌లో మూడు నెలల9 కాలవ్యవధితో ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాంను ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్ జ్యోతి, లచ్చిరాం భూక్య, డీజీ భిక్షపతి, జిఎం ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సివిల్ ఇంజినీరింగ్ పట్ట్భద్రులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం కోసం న్యాక్ ద్వారా ఈ శిక్షణ ఇప్పిస్తున్నట్టు చెప్పారు.