తెలంగాణ

రాష్ట్ర సరిహద్దుల్లో మావోల బాంబు బూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 1: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మళ్లీ మావోల అలజడి పోలీసులకు సవాల్‌గా మారింది. ముందస్తు అంసెబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏకకాలంలో తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మహాదేవపూర్, మండలాలతో పాటు భద్రాచలం కొత్తగూడెం జిల్లా, చర్ల తదితర ప్రాంతాల్లో బాంబు బూచి తరహా ప్రధాన రహదారులపై మావోయిస్టులు ఎరుపు బ్యానర్లు, కర పత్రాలు పెట్టారు. బ్యానర్లకు బాంబులు అమర్చినట్లు ఎలక్ట్రికల్ వైర్లు పెట్టి భయభ్రంతులకు గురిచేశారు. ఇప్పటికే పోలీసులు ఎజెన్సీ ప్రాంతాలలో మావోలు సంచరిస్తునట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. కాగా కొద్ది రోజుల క్రితమే జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్, వరంగల్, పెద్దపల్లి జిల్లాల మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరున లేఖ విడుదలైంది. ఆ లేఖలో ఎన్నికలు బహిష్కరించాలంటూ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ విధానాన్ని ఎండగట్టారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. తాజాగా రోడ్లపై వెలిసిన బ్యానర్లు, కరపత్రాల పైన కూడా ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి ప్రత్యేక్ష చర్యలు దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రాబల్యప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే మావోయిస్టులు చేసిన ఈ చర్యలను పోలీసులు తెలికగా కొట్టేశారు. ఎన్నికల నేపధ్యంలో మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకే బాంబు బూచి తరహా ఇలాంటి చర్యలు పాల్పడారని అన్నారు. ఇప్పటికే ఎన్నికల నేపద్యంలో చతీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు పెట్టిన నేపథ్యంలో పోలీసులు కూడా అలెర్టు అయ్యారు. మరో వైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్ధులు ఏజెన్సీ ప్రాంతాలలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పోలీసులు అభ్యర్థులకు సూచనలు చేసారు.