తెలంగాణ

టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: తెలంగాణ ఆర్టీసిలో సమ్మెకు దిగేందుకు కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఈనెల 24 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని గురువారం ఆర్టీసీ ఎండి జివి రమణారావుకు ఏడు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. కాగా ఆర్టీసి గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) ఈ నెల 7వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని ఆ నోటీసులో టిఎంయు స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీలో ప్రభుత్వ మద్దతు ఉన్న గుర్తింపు సంఘం కూడా సమ్మెకు నోటీసు ఇవ్వడంతో ఆర్టీసి యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. దీనికితోడు మిగిలిన యూనియన్లు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇవ్వడం, 24 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని స్పష్టం చేయడంతో యాజమాన్యం, ప్రభుత్వం ఆలోచనలో పడింది. త్వరలో యూనియన్లతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. కార్మిక సంఘాలు మొత్తం 42 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచాయి. వీటిని పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగడం ఖాయమని పేర్కొన్నాయి. 2014 నుంచి అమలు కావాల్సిన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, కనీస వేతనాన్ని రూ.24 వేలకు పెంచాలని, ఆర్టీసీ ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ బకాయిలు వెంటనే చెల్లించాలని, తమిళనాడు తరహాలో డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, పలు ఇతర డిమాండ్లను యూనియన్లు ఆర్టీసీ యాజమాన్యం ముందు ఉంచాయి.

రైతుబంధుకు అతిథుల డుమ్మా
హైదరాబాద్, మే 10: దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయని వినూత్న ‘రైతుబంధు’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఏ ఒక్కరూ హాజరుకాలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన అతిథులు రాకపోయినా ఇంత పెద్ద కార్యక్రమానికి కనీసం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అయినా హాజరై ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను, అంతకుముందు కోల్‌కతా వెళ్లినప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను రైతు బంధు కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. డిఎంకె నాయకుడు స్టాలిన్ అయితే తాను తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తానని మాట ఇచ్చినప్పటికీ ఆయన కూడా హాజరుకాలేదు.