తెలంగాణ

కాంగ్రెస్‌కు ఏపీ మాజీ మంత్రి వట్టి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 1: ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలయికను నిరసిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా వట్టి వసంతకుమార్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అణచివేసేందుకు పుట్టిందే టీడీపీ. అటువంటి పార్టీ కాంగ్రెస్‌తో జత కట్టాలనుకోవడాన్ని భరించలేకపోతున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టిన చంద్రబాబును, రాహుల్ గాంధీ అక్కున చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ రెండు పార్టీల కలయిక ఎంతో కాలం కొనసాగదని వట్టి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కలిసిన కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని, ఆ తరువాత చంద్రబాబే కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటిస్తారని వట్టి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఏంటని ఆయన ప్రశ్నించారు. 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులం., ఇప్పుడు, టీడీపీతో కలిసి పనిచేయడానికి ఏమాత్రం సహించలేమని అన్నారు.