తెలంగాణ

మేనిఫెస్టో అమలుకు చట్టబద్ధ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలుకు చట్టబద్ధ కమిటీని తెస్తామని, ఈ కమిటీకి ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా వ్యవహరించనున్నారని టీటీడీపీ ప్రధానకార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. ఈ తరహా కమిటీ పశ్చిమబెంగాల్‌లో ఉందని అన్నారు. చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో కీలక మలుపు కానున్నాయని, టీఎస్ తరహా రాజకీయాలే దేశంలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజకీయ మోడల్ కాబోతోందని, అదే దేశవ్యాప్తంగా రోల్‌మోడల్ కాబోతోందని ఆమె పేర్కొన్నారు. త్రీడీ సినిమా చూపిస్తామని కవిత అంటున్నారని, అసలు సినిమా కల్వకుంట్ల కుటుంబానికి చూపించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ 105 నియోజకవర్గాల్లో 200 సభలను నిర్వహిస్తే వీటిలో అసమ్మతులే 100 సభలను నిర్వహించారని, టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్ధులను వారి పార్టీ వారే తిరస్కరిస్తున్నారని , మరోసారి తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం జరుగుతోందని అన్నారు. తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాలు, మహిళలు, అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ముందుకు వెళ్తోందని అన్నారు. టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోందని చెప్పారు. త్వరలో 10వేల మంది ఎల్లో ఆర్మీతో సమావేశం ఏర్పాటు చేసి దశాదిశా నిర్దేశించడం జరుగుతుందని అన్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సరేనని, అసలు పటేల్ ఆశయ సాధనకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఏం చేసిందని సాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ నిలదీశారు.