తెలంగాణ

జైపాల్‌యాదవ్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ‘ఈ ఒక్కసారికి జైపాల్‌యాదవ్‌కు అవకాశం ఇవ్వండి, భవిష్యత్‌లో అవకాశం మీకే దక్కుతుంది’ అని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన హామీకి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అంగీకరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. పార్టీ ఖరారు చేసిన జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారానికి నారాయణరెడ్డి ఇంతకాలం దూరంగా ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్, గురువారం కల్వకుర్తిలో ప్రచారానికి బయలుదేరే ముందు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని బేగంపేటలో తన నివాసానికి పిలిచి చర్చించారు. టికెట్ ఆశించడం తప్పుకాదని, ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించాక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేసారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సామాజిక సమీకరణలల్లో భాగంగా జైపాల్‌యాదవ్‌కు రెండవ సారి అవకాశం కల్పించిందని వివరించారు. ప్రకటించిన అభ్యర్థులను మార్చడం కుదరదని పార్టీ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పడంతో ఈ ఒక్కసారి జైపాల్‌యాదవ్ విజయానికి కృషి చేయాల్సిందేనని కేటీఆర్ సూచించారు. గత ఎన్నికల్లో ఇండిపెండెండ్‌గా పోటీ చేసినప్పటికీ భారీగా ఓట్లు సాధించిన తనకు టికెట్ ఇస్తే వందకు వందశాతం గెలుస్తానని నారాయణరెడ్డి చెప్పినట్టు తెలిసింది. అలాంటప్పుడు పార్టీ అధికారికంగా ప్రకటించిన జైపాల్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యతను మీరే (నారాయణరెడ్డి) తీసుకుంటే పార్టీలో మంచి భవిష్యత్ కల్పించనున్నట్టు కేటీఆర్ బుజ్జగించారు. మీ మాట నమ్మకంతో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని నారాయణరెడ్డి హామీ ఇవ్వడంతో కల్వకుర్తిలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన్ను కేటీఆర్ వెంట తీసుకెళ్లడంతో అసమ్మతి సమసిపోయినట్టే. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన అసమ్మతి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్ఠానం నిర్ణయించినప్పటికీ, అసమ్మతి నేతల్లో కొందరు తాను చెబితే వింటారన్న నమ్మకంతో కేటీఆర్ సదరు నేతలను హైదరాబాద్‌కు పిలిచి చర్చిస్తున్నారు.