తెలంగాణ

సంప్రదాయ మాధ్యమాల కన్నా సోషల్ మీడియా మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి:
===========

ధర్మపురి, నవంబర్ 2: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగుతున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకులకు వరకు చేతిలో అందుబాటులోకి వచ్చాయి సామాజిక మాధ్యమాలు. ప్రధాన స్రవంతిలోని మీడియాను మించి సోషల్ మీడియా పని చేయడం సర్వత్రా కనిపిస్తున్నది. చేతిలో సెల్‌ఫోన్ లేకుండా, రాత్రి నిద్రించే వరకు, పొద్దున లేచింది లగాయతు సోషల్ మీడియాలో నిమగ్నం కాని వారు ఉంటారా అన్నది సందేహాత్మకమే. సోషల్ మీడియా అంతగా ప్రభావం చూపుతున్న ఈ రోజులలో ఎన్నికల సంబంధ అంశాలు, వేగవంత ప్రచారాలకు, సమాచార చేరవేతలకు సామాజిక మాధ్యమాల పాత్ర ఆద్వితీయం, అపూర్వం, అసమానమైంది. గతంలో ఎన్నికలు వస్తున్నాయనగానే గ్రామ గ్రామాన గోడమీద రాతలు ప్రత్యక్షమయ్యేవి. కాగితాలపైన, ఆపై ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ముద్రితాలైన అభ్యర్థుల వివరాలు, వీలేతై ఫోటోలు, ఎన్నికల గుర్తులతో ఇంటింటికీ తలుపులపై, ఆపై జన సమ్మర్ద అనుకూల ప్రదేశాలలో అతికించ బడేవి. తర్వాతి కాలంలో బ్యానర్లు, ఫ్లెక్జీలు, పోస్టర్లు, కటౌట్లు, కరపత్రాలు, గోడ పత్రికలు, ఎన్నికల వాగ్ధానాల, హామీలతో కూడిన బ్రోచర్లు, అన్ని వనరుల వినియోగం ప్రచారానికి ఉప యోగించడం ఆచరణలోకి వచ్చింది. గత ఎన్నికలలో వీటికి తోడు రికార్డెడ్ వాయిస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలకు అభ్యర్థులు స్వయంగా తమ విజ్ఞప్తులను వినిపించడం జరిగింది. వీటికి తోడు ప్రసార మాధ్యమాలలో స్క్రోలింగ్‌లు, యాడ్స్, జన స్రవంతిలో గల వివిధ పత్రికల పెయిడ్ ఆర్టికల్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహింప బడేవి. రానురాను ఎన్నికల కమిషన్ దృష్టి అధికమవుతుండడం, శాసనసభలో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం 28లక్షలకు మించరాదని ఖచ్చితమైన నిబంధనలుండడం, నిర్ణీత ఖర్చుకు సంబంధించి లక్ష్మణ రేఖ దాటినట్లు రుజువైతే గెలిచినా పదవి పోవడం ఖాయమని ఖచ్చితమైన పాటింపులు ఉండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు, అభిమానులు, ప్రత్యర్థులు, వారి అనుచర గణాలు, ప్రత్యామ్యాయాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాలలో వేలాది మందికి గ్రూపుల ద్వారా పోస్టులు శరవేగాన్ని సవాలు చేస్తూ వెళుతున్నాయి. ప్రధానంగా సాంప్రదాయక ప్రసార, ప్రచార సాధనాలకు పరిమితులు ఉండి, ఉన్నదున్నట్లు ప్రచురించే, ప్రసారం చేసే అవకాశాలు లేని, రాయడానికి, మాట్లాడడానికి వీల్లేని, నిఘంటువులలో చోటు చేసుకోని, అసభ్య, అమానుష, అప్రజాస్వామిక భాష రాజ్యమేలుతున్న స్థితిలో, సామాజిక మాధ్యమాలు అడ్డూ, అదుపూ లేని, నేరుగా, వీడియో, ఆడియో రికార్డింగులు ఉన్నది ఉన్నట్టుగా, వెనువెంటనే సెల్‌ఫోన్ల ద్వారా గమ్యాలకు చేరుస్తున్నాయి. పొగడ్తలూ, తెగట్తలూ, సత్, దుష్ప్రచారాలు తేడా లేకుండా, అస్మదీయుల, తస్మదీయులనే భేదాలు లేకుండా ఇష్టార్యాంగా వైరస్‌లు అవుతున్నాయి. పైగా ఎవరి స్వాధీనంలో లేని, పైసా ఖర్చుకాని, నియంత్రణ ఊసే కానరాని సదరు మాద్యమాల ద్వారా జరుగుతున్న పోస్టింగ్‌ల పరంపరనే ప్రస్తుత ఎన్నికలలో ప్రధాన భూమికలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పాలనాధికారం ఎవరికి చెందాలో ఆత్మవంచన చేసుకునే పార్టీల మానస పుత్రికలైన పత్రికలకు, ఛానళ్ళకు సామాజిక మాధ్యమాలు పని చేస్తున్నాయి.