తెలంగాణ

కమ్యూనిసు ట.. కాంగ్రెస్‌ల పోరుగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి:
===========
వలిగొండ, నవంబర్ 2: దేశ తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుండి 52ఏళ్ల పాటు అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రామన్నపేట నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనతో రద్దయి చరిత్రలో కలిసిపోయింది. 1952లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన రామన్నపేట నియోజకవర్గానికి 2004వరకు 13సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు, కమ్యూనిస్టులు ఆరుసార్లు విజయం సాధించడం గమనార్హం. దివంగత కాంగ్రెస్ దిగ్గజం ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 1962లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటికీ శాసన మండలి సభ్యుడిగా 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి, 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో పనిచేశారు. 1994లో ఏపీఐసిసి చైర్మన్‌గా, 2004లో తెలంగాణ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. సీనియర్ నేతగా ఉప్పునూతల రామన్నపేటకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికి 1994లో ఆనాటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని, 2003లో అప్పటీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడును, 2005లో ఆనాటి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని నియోజవర్గానికి రప్పించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపించిన రాజకీయంగా తన పలుకుబడినా చాటుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి గెలిచిన కొమ్ము పాపయ్య సైతం 1981లో టీ.అంజయ్య మంత్రివర్గంలో పనిచేయడం విశేషం. 2004వరకు రామన్నపేట, మోత్కూర్, గుండాల, ఆత్మకూర్(ఎం), వలిగొండ మండలాలతో నియోజకవర్గంగా ఉన్న రామన్నపేట 2009లో పునర్విభజనతో నాలుగు ముక్కలై రద్దయ్యింది. వలిగొండ మండలం భువనగిరి నియోజకవర్గంలో, రామన్నపేట నకిరేకల్ (ఎస్సీ) నియోజకవర్గంలో, మోత్కూర్ తుంగతుర్తి (ఎస్సీ)లో, గుండాల, ఆత్మకూర్ (ఎం)లు ఆలేరు (జనరల్) నియోజకవర్గంలో కలువడంతో కనుమరుగైన రామన్నపేట కేంద్రం తాలుకాగా, మున్సిపాల్టీగా, గ్రేడ్-1పంచాయతీగా, మండల కేంద్రంగా ప్రస్థానం సాగించింది.

రెండు పార్టీల మధ్యనే గెలుపు ఓటముల దోబుచులాట
తొలిసారిగా రామన్నపేట నియోజకవర్గంలో 1952లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థి కట్కూరి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వి.కేశవరావుపై 15,453ఓట్లతో గెలుపొందారు. 1957లో పీడీఎఫ్ అభ్యర్థిగా రెండోసారి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కె.వెంకట్‌రెడ్డిపై 1257ఓట్లతో, 1962లో సీపీఐ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రత్యర్థి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై 5,268ఓట్లతో గెలిచి హాట్రిక్ విజయాలు నమోదు చేశారు. అనంతరం 1967ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వడ్డెపల్లి కాశీరామ్ సీపీఐ అభ్యర్థి ఎస్.అయిలయ్యపై 4,568ఓట్లతో, 1972ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా కాశీరామ్ సీపీఐ అభ్యర్థి బాలెంల నరసింహపై 4,520ఓట్ల తేడాతో రెండోసారి గెలుపొందారు. కాశీరామ్ మృతితో 1974లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెరికె రాజరత్నం సీపీఐ అభ్యర్థి బాలెం నరసింహపై గెలుపొందారు. నల్లగొండ పట్టణానికి చెందిన వడ్డెపల్లి కాశీరామ్ నల్లగొండ పార్లమెంట్(ద్విసభ) స్థానానికి 1960లో డి.వెంకటేశ్వర్‌రావుతో పాటు ఎన్నికైన డి.రాజయ్య మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 95,272ఓట్లతో గెలుపొందారు. 1962లో మిర్యాలగూడ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాశీరామ్ ఓటమి చెందడం గమనార్హం. రామన్నపేటలో 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొమ్ము పాపయ్య సీపీఐ అభ్యర్థి గుర్రం యాదగిరిరెడ్డిపై గెలువగా, 1983 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా కొమ్ము పాపయ్య సీపీఐ అభ్యర్థి సుశీలాదేవిపై 1589 ఓట్లతో విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్దిగా గుర్రం యాదగిరిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తుమ్మల సురేందర్‌రెడ్డిపై గెలుపొందగా, 1989 ఎన్నికల్లో సీపీఐ నుండి గుర్రం యాదగిరిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై, 1994 ఎన్నికల్లో మరోసారి సీపీఐ నుండి యాదగిరిరెడ్డి కాంగ్రెస్ రెబెల్, స్వతంత్ర అభ్యర్థి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము పాపయ్య మూడో స్థానంలో నిలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి టీడీపీ అభ్యర్థి మోతే సోమిరెడ్డిపై, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి రెండోసారి ఉప్పునూతల టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దాసరి మల్లేశంపై గెలుపొందారు.