తెలంగాణ

రైళ్ల సమయపాలనలో గణనీయమైన మెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: రైళ్ల రాకపోకల సమయపాలనలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గణనీయంగా మెరుగుదల సాధించింది. గత కొనే్నళ్ల నుంచి పోల్చి చూస్తే ఇటు సాంకేతికంగా, అటు శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల సమయపాలన మెరుగుపడి మంచి ఫలితాలు వస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇటీవల ద.మ.రై జిఎం వినోద్‌కుమార్ యాదవ్ సమయపాలన పట్ల అత్యధిక శ్రద్ద తీసుకోవాలని డిఆర్‌ఎంలు అందరికీ సూచించిన సంగతి తెలిసిందే. ఆయన జిఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస సమీక్షల ఫలితంగా మిగిలిన అంశాలతో పాటు సమయపాలన బాగా మెరుగుపడిందని ఆయా వర్గాలు తెలిపాయి. దీనిలో భాగంగా 2014-17 సంవత్సరాల మధ్య సమయపాలన 96 శాతం మెరుగుపడింది. అయితే 2017-18లో రైలు ప్రయాణికుల భద్రత ప్రధాన ధ్యేయంగా భావించడం, వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, రైలు పట్టాల నిర్వహణ, కొత్త సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టిన కారణంగా సమయ పాలన పనితీరు కొంచెం తగ్గి 92 శాతానికి చేరిందని ద.మ.రై పేర్కొంది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 71 కిలోమీటర్ల రైలు మార్గం నిర్వహణ చేపట్టిన ప్రతి రోజూ బ్లాకు చేయాల్సిన సెక్షన్లను ఎంపిక చేసి నిర్ణీత గంటల కాల వ్యవధిని స్ధానిక ప్రజలకు ముందుగా తెలియజేసి వేగవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది.
ప్రతి రోజు 127 బ్లాక్‌లను చేపట్టి ఏడాది మొత్తం 1,23,178 గంటలను వినియోగించుకుని ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది సంవత్సరం రైలు పట్టాల నిర్వహణ, అభివృద్ధి, మెరుగుదల కోసం చేపట్టిన చర్యలు దక్షిణ మధ్య రైల్వేలో భద్రతా ప్రమాణాలను పెంచుతూ జీరో యాక్సిడెంట్ రికార్డ్ స్ధాయికి చేరడం జరిగిందని రైల్వే తెలిపింది. సమయపాలన స్ధాయి పెంచుకునేందుకు మరికొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. రైలు వినియోగదారుల ఆకాంక్షలను తీర్చడం కోసం నాలుగు జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రెండు జతల ప్యాసింజర్ రైళ్లు గమ్య స్ధానాలను పొడిగించామని పేర్కొంది. 2017-18లో 14 రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు వాటి ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గించడం జరిగిందని స్పష్టం చేసింది.