తెలంగాణ

కాంగ్రెస్‌కు కంచుకోట వరంగల్ తూర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి.....
============
వరంగల్, నవంబర్ 3:ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుండె కాయ వరంగల్ తూర్పు నియోజకవర్గం. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు గత ఎన్నికల్లో మాత్రం గులాబి జెండా ఎగరవేసింది. మైనార్టీలు, బడుగుబలహీన వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే జయకేతనం ఎగరవేశారు. మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు స్వతంత్య్ర అభ్యర్ధులు గెలవగా 2014 ఎన్నికల్లో మొదటిసారిగా టీఆర్‌ఎస్ జెండా ఎగరేసింది. నియోజకర్గంలో మొదటి సారిగా 1952లో ఎన్నికలు జరుగగా అప్పటి కాగ్రెస్ అభ్యర్ధి ఎంఎస్ రాజలింగం గెలుపొందాడు. 1957లో కూడా మీర్జ ఉమర్‌బేగ్ కాంగ్రెస్ అభ్యర్ధే గెలుపొందారు. 1962లో స్వత్యంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన నాగభూషణం రావు గెలుపొందగా 1967 కూడా స్వతంత్య్ర అభ్యర్ధి టీఎస్ మూర్తి గెలుపొందారు. అ తర్వాత 1972లో కాంగ్రెస్ అభ్యర్ధి పి.ఉమారెడ్డి, 1978లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటి చేసిన ఆరెల్లి బుచ్చయ్య గెలుపొందారు. 1983,1985 రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా అప్పటి టీడీపీ అభ్యర్ధి బండారి నాగభూషణం రావే గెలుపొందారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ అభ్యర్ధి టీ. పురుషోత్తం రావు, 1994లో టీడీపీ అభ్యర్ధి దోనెపూడి రమేష్‌బాబు గెలుపొందగా 1999, 2004,2009 వరసగా మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి బస్వారాజు సారయ్య హైట్రిక్ విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం మొదటి సారిగా టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటి చేసిన కొండా సురేఖ గెలుపొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకం కావడంతో ఇక్కడ మొదటి నుండి ఇప్పటి వరకు కూడా అభ్యర్ధుల ఎంపిక కత్తిమీద సామే. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో ఒక్కోకో పార్టీ నుండి ఇద్దరి నుండి మొదలుకొని ఆర డజన్‌కు పైగా అభ్యర్ధులు హోరాహోరిగా పోటీలు పడుతారు. చివరి వరకు కూడా అభ్యర్ధుల ఎంపిక ఉత్కంఠానికి గురిచేస్తుంది. 1989లో కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇదే ఉత్కంఠం కొనసాగింది. ముందుగా మాజీ మంత్రి బస్వరాజు పేరు అధిష్థానం ఖారారు చేయగా చివరి నిమిషంలో మాజీ మంత్రి పురుషోత్తం రావుకు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగ పడ్డ సారయ్య స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 1994లో కూడా టీడీపీ, జనతాదల్ పార్టీలు పొత్తు పెట్టుకోగా జనతాదల్ నుండి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు పేరు ఖరారు అయ్యింది. ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే ఆఖరి క్షణంలో టీడీపీ తరుపున దొనేపుడి రమేష్ బాబు పేరును ఖరారు చేసి భీం ఇచ్చారు. అదే విధంగా 1999లో కూడా కాంగ్రెస్ టికెట్ కోసం బస్వరాజు సారయ్య, గుండా ప్రకాశ్‌రావు హోరా హోరిగా పోటి పడ్డారు. చివరి నిమిషంలో సారయ్య పేరును ఖరారు అయింది. 2004లో కూడా టీడీపీ నుండి దోనెపూడి రమేష్ బాబుతో పాటు మూగ రాంమోహాన్, డాక్టర్ పోలా నటరాజ్ , గుండు సుధరాణి పోటి పడ్డారు. చివరికి సుధారాణి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ మహా కూటమిగా ఏర్పడగా మూడు పార్టీల నాయకులు టెకెట్లు ఆశించారు. చివరకు విద్యసాగర్ పేరు ప్రకటించారు. నామినేషన్ చివరి రోజు టీడీపీకి చెందిన నరేందర్ రెడ్డి, గుండు సుధారాణి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు కూడా మహాకూటిమి అభ్యర్ధి ఎవ్వరు అనేది ఆసక్తి రేపింది. 2014లో టీడీపీ, బీజేపి పొత్తు పెట్టుకున్నాయి.