తెలంగాణ

ఐక్య ఉద్యమాలకు రైతు సంఘాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రైతు సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయి. కంటి తడుపు చర్యలతో వ్యవసాయాన్ని ఎన్నటికీ బాగు చేయలేమని, జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని అమలు చేయడం ద్వారానే వ్యవసాయదారులు సంతోషంగా జీవించగలుగుతారని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ పేర్కొన్నారు. ఏ రైతు తనకు ప్రభుత్వం నుంచి సాయం కావాలని కోరుకోవడం లేదని, తాను పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారని చెబుతున్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా రైతుల ఆత్మహత్యలు ఆగకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కేరళ తరహాలో రుణ విముక్తి చట్టం, కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని స్వాగతించిన రైతు సంఘాలు వాస్తవ సాగుదారుల బాగోగులను గాలికి వదిలివేశారని మండిపడ్డాయి. దీంతో ఇప్పటికే పలు వేదికలపై ప్రభుత్వ తీరును ఆయా సంఘాల నాయకులు ఎండగడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల అతి కొద్ది మంది రైతులకే లబ్ధి చేకూరుతుందని, క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే వారికి ప్రయోజనం లేనప్పుడు పథకం ఎందుకని నిలదీస్తున్నారు. కౌలు రైతులు, పోడు వ్యవసాయం చేసే రైతులు అత్యధికంగా ఉన్నారని వారి పరిస్థితి ఏమిటని రైతు సంఘం కార్యదర్శి పశ్యపద్మ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో 24 రైతు సంఘాలతో జేఏసీగా ఏర్పడి సమిష్టి ఉద్యమాలకు సిద్ధం అవ్వాలని నిర్ణయించాయి.
ఇందులో భాగంగా ఈనెల 23న జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాల ముట్టడి, వచ్చేనెల 1న భద్రాచలం నుంచి కరీంనగర్ వరకు రోడ్లను దిగ్బంధించాలని తలపెట్టాయి. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే మహారాష్ట్ర తరహాలో రైతులను చైతన్యపరిచి మహా ఉద్యమాన్ని నిర్మించాలని కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.