తెలంగాణ

పెరిగిన పోటీ, తగ్గిన సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యుజి కోర్సుల కౌనె్సలింగ్ ఈ నెల 28న ప్రారంభం కానుంది. గత వారం జరిగిన ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న ప్రకటించనున్నారు. అనంతరం రెండు రోజుల్లో ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే వీలుకల్పిస్తారు. మూడోవారంలో అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసి నెలాఖరు నుండి కౌనె్సలింగ్ ప్రారంభిస్తారు. ఈసారి కౌనె్సలింగ్ సైతం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అలాగే అభ్యర్ధులు వెరిఫైడ్ సెల్‌ఫోన్ నుండి రిజిస్టర్ చేసుకుంటే వెంటనే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి వెబ్ ఆప్షన్లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. సర్ట్ఫికేట్ల డాటా ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. పదో తరగతి సర్ట్ఫికెట్, ఇంటర్ సర్ట్ఫికెట్, ఆధార్ నెంబర్, కుల ధృవీకరణ పత్రాల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మరో పక్క ఇదే డాటాను డిగ్రీలో చేరేందుకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ నెట్‌వర్కుతో అనుసంధానం చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఇటు డిగ్రీలో చేరితే అటు ఇంజనీరింగ్‌లో సీటు, ఇంజనీరింగ్‌లో చేరితే డిగ్రీలో సీటు కోల్పోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇందుకు అభ్యర్ధుల అనుమతి ముందే తీసుకుంటామని పాపిరెడ్డి చెప్పారు. మరో పక్క ఇతర రాష్ట్రాల నుండి దరఖాస్తు చేసిన వారి పత్రాలను సైతం వెరిఫై చేసేందుకు ఎమ్సెట్ అడ్మిషన్స్ కమిటీ అత్యాధునిక పద్ధతులను అవలంబిస్తోంది.
సమాన సంఖ్యలో సీట్లు
రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీంకు 73,106, ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,47,958 దరఖాస్తులు రాగా, అగ్రికల్చర్ స్ట్రీంలో 71,766 మంది, ఇంజనీరింగ్ స్ట్రీంలో 1,36,311 మంది పరీక్ష రాశారు. అయితే ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి చూసుకుంటే రాష్ట్రంలో గత ఏడాది 1,24,239 సీట్లు ఉండగా, ఈ ఏడాది ఆ సీట్ల సంఖ్య 1,10,117కు తగ్గనున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 87 వేలు కాగా, ఈ ఏడాది కన్వీనర్ కోటా 80 వేల కంటే తక్కువ కానున్నాయి. అంటే ఇంజనీరింగ్‌కు 1,36,311 మంది రాయగా, సీట్ల సంఖ్య దాదాపుగా 80వేలు అందుబాటులో ఉండనున్నాయి. ఇంజనీరింగ్‌కు హాజరైన వారిలో క్వాలిఫై కాని వారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు , ఇతర రాష్ట్రాల కాలేజీలకు తరలివెళ్లేవారి సంఖ్యను తీసుకుంటే అది దాదాపు 40వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకో పక్క ఆంధ్రాకు చెందిన వారే 17,041 మంది రాశారు. వారిలో 80 శాతం మంది తెలంగాణలో చేరే అవకాశాలు లేవు. ఈ గణాంకాలను తీసుకుంటే పరీక్ష రాసిన వారికి, దాదాపు సమాన సంఖ్యలో సీట్లు అందుబాటులోకి వస్తాయి.
మంచి కాలేజీలే కీలకం
సమాన సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నా, మంచి కాలేజీల్లో మంచి బ్రాంచి లభించడమే లక్ష్యంగా అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తొలి ప్రాధాన్యత యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇస్తున్నారు. తర్వాతి ప్రాధాన్యత ప్రైవేటు కాలేజీల్లో సకల సౌకర్యాలున్న కాలేజీలకు ఇస్తున్నారు. మొత్తం 29 బ్రాంచిలలో ప్రవేశానికి అవకాశం ఉంది. కానివాటిలో ఐదారు బ్రాంచిలలోనే ఎక్కువగా చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఎన్నిసీట్లు ?
తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్‌లో 7788 సీట్లు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 1668సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 15322 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 8412, ఐటిలో 2487, మెకానికల్‌లో 9872 సీట్లు , అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో 32, ఏరోనాటికల్‌లో 210, కెమికల్‌లో 246, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్‌లో 238 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన అన్ని బ్రాంచిల్లో ఒక్కో దాంట్లో 100 లోపు సీట్లు మాత్రమే అందుటులో ఉన్నాయి.
ప్రస్తుతం యూనివర్శిటీ కాలేజీలు 10, జెఎన్‌టియు పరిధిలో 236, కేయు పరిధిలో 4 కాలేజీలు అనుబంధ గుర్తింపును పొందాయి. తుది జాబితా రూపొందించే నాటికి ఈ సంఖ్యలో మార్పు ఉండే అవకాశం ఉందని కన్వీనర్ డాక్టర్ యాదయ్య పేర్కొన్నారు. అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చినపుడు తొలుత తనకు నచ్చిన బ్రాంచిని ముందు ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో దాదాపు పాతిక వరకూ యూనివర్శిటీ కాలేజీలు, టాప్ ప్రైవేటు కాలేజీలు, అటానమస్ కాలేజీల్లో ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతి స్థానంలో నచ్చిన రెండు బ్రాంచిలను ఎంచుకుని యూనివర్శిటీ కాలేజీలలో ఆప్షన్ ఇచ్చిన తర్వాత టాప్ ప్రైవేటు కాలేజీలకు , అటానమస్ కాలేజీలకు రావాలి. ఇంత వరకూ చూసుకుంటే 10 యూనివర్శిటీ కాలేజీలు, 20 టాప్ ప్రైవేటు కాలేజీలు, ఐదు అటానమస్ కాలేజీలు కలిపి 35 కాలేజీల్లో సుమారు 100 ఆప్షన్లు పూర్తవుతాయి. ఇది పూర్తయిన తర్వాత బి గ్రేడ్ ప్రైవేటు కాలేజీలు 10 ఎంపిక చేసుకుని టాప్ బ్రాంచిని అందులో అప్లయి చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత నచ్చిన ఇతర రెండు బ్రాంచిలను ఈ కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వాలి. అంటే మరో 30 ఆప్షన్లుపూర్తవుతాయి. ఇదంతా ముగిసిన తర్వాత సమీపంలోని కాలేజీలు, అందుబాటులో ఉన్న కాలేజీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో ఇతర ప్రాంతాల్లోని కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు ప్రధానంగా హాస్టల్ ఇతర సౌకర్యాలను చూసుకుని నమోదుచేయాలి. హాస్టల్‌లో ఉండే అలవాటు లేని వారు డే స్కాలర్ కాలేజీలకే పరిమితం కావాలని ఇంజనీరింగ్ కాలేజీల సంఘం ప్రతినిధులు డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ ఎస్వీరావు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌కే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో మంచి గిరాకీ ఉన్న ఫార్మసీ సీట్లను కూడా అభ్యర్ధులు ఎంపికచేసుకోవచ్చని ఫార్మసీ కాలేజీల సంఘం ప్రతినిధి డాక్టర్ రామదాస్ వివరించారు.